Saturday, May 11, 2024
- Advertisement -

నవంబర్ యమా బిజీ

- Advertisement -

తెలుగుసినిమా నిర్మాతలు నవంబర్ నెలని ప్రత్యేకంగా చూడరు, వారికి ఈ నెల అసలు అచ్చిరాదు అని చెప్పాలి. ముఖ్యంగా అప్పుడే దసరా శలవలు తరవాత స్కూల్స్ కీ ఆఫీసులకీ పనుల్లో మునిగిపోయే జనాలు ఉంటారు కాబట్టి ఆ సమయంలో సినిమా విడుదల అంటే చాలా వెనక అడుగు వేస్తారు కానీ ఈ నవంబర్ మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా ఉండబోతోంది.

త్రిపుర, చీకటి రాజ్యం, అఖిల్, శంకరాభరణం, బెంగాల్ టైగర్, కుమారి 21ఎఫ్ ఇలా అరడజను సినిమాలు నవంబర్ కు ఫిక్స్ అయ్యాయి. ఇంకా రెండు మూడు చిన్న సినిమాలో ప్రతీ వారానికీ ఉండనే ఉన్నాయి. ప్రతీ వారం ఖచ్చితంగా రెండు సినిమాలు విడుదల అయ్యి అక్టోబర్ కంటే నవంబర్ నే మరింత ఆసక్తికరంగా ఉంచబోతున్నాయి.

మొదటి రెండు వారాలూ కాస్త సైలెంట్ గా ఒక్కొక్క సినిమా వచ్చినా మూడవ వారం నుంచీ మాత్రం ప్రతీ వారం రెండు సినిమాలు ఉంటాయి. తరవాత వారాలు రెండు రెండు సినిమాలు వారంతంలో విడుదల కానున్నాయి. అన్ని సినిమాల్లో దీపావళికి రాబోతున్న అఖిల్ పెద్దది కాగా తరవాత స్థానంలో బెంగాల్ టైగర్ ఉంటుంది. కోనా వెంకట్ శంకరాభరణం, సుకుమార్ కుమారీ సినిమాలు ఈ నెలలోనే తమ అదృష్టం పరీక్షించుకోబోతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -