Sunday, April 28, 2024
- Advertisement -

పవన్ గురించి కత్తి మహేష్ కి కాల్ చేసిన ఎన్టీఆర్

- Advertisement -

పవన్ కళ్యాణ్ పై మహేష్ కత్తి కామెంట్స్ చేయడంతో అతనిపై పవన్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారు. మహేష్ కత్తి వెనక్కి తగ్గకపోవడంతో.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దాంతో.. కత్తి మహేష్ కి ఫోన్ చేసి.. వార్నింగ్ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తాజాజా ఎన్టీఆర్ కూడా ఓ సంగతిపై మహేష్ కత్తి తో మాట్లాడరని తెలుస్తోంది. ఈ సంగతిని కత్తి మహేష్ కి సన్నిహితంగా ఉండేవారు లీక్ చేశారు. బిగ్ బాస్ షో తర్వాత ఇలా కత్తి మహేష్.. పవన్ పై విమర్శలు చేయడంతో అతనికి ఎన్టీఆర్ ఫోన్ చేశాడట. కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై ఇలా కామెంట్స్ చేయడం వెనక ఎన్టీఆర్ ఉన్నట్లు కొంతమంది పవన్ ఫ్యాన్స్ ఆరోపించడంతో.. ఎన్టీఆర్ కి బాధకలిగించిందని సమాచారం.

ఈ కారణంతో మహేష్ కత్తికి కాల్ చేసి.. ఇక దీనికి ఫుల్ స్టాప్ పెట్టు.. ఎందుకు ఇలా చేయడం.. ఇలా చేయడం వల్ల ముందు ముందు రోజుల్లో నువ్వే నష్టపోతావు అని ఎన్టీఆర్ వివారించారట. ఇక్కడితో ఆపేస్తే.. అన్ని సర్ధుకుంటాయని.. కత్తిమహేష్‍కి అతని సన్నిహితులు చెపుతున్నారట. ఏది ఏమైనా.. పవన్ ఫ్యాన్స్ కత్తి మహేష్ కి ఇంకా చుక్కలు చూపిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -