Saturday, May 11, 2024
- Advertisement -

వదిలిపెట్టే సమస్యే లేదు.. సన్యాసం తీసుకోవాల్సిందే – అఖిల ప్రియ

- Advertisement -

నంద్యాలలో పోరు ఏ రేంజ్ లో జరిగింది అందరికి తెలిసిందే. ఒకరి మీద ఒకరు సవాళ్లు విసురుకున్నారు. కానీ విజయం మాత్రం ఒక్కరికే కాబట్టి.. అది కాస్తా ఒకవైపు మళ్లీంది. ఇక మిగితా సైడ్ వణుకు స్టార్ట్ అయింది. ఉన్న ప్రెస్టేజికి ప్రెస్టేజి గంగలో కలిసింది. అయితే శిల్పా మోహన్ రెడ్డి.. అనవసరంగా పార్టీ మారానా..? వైసీపీ తరుపున పోటీ చేసి తప్పు చేశానా అని ఆయన అనుకుంటున్నారట. ఇక ఓడిపోతే.. రాజకీయ సన్యాసం చేస్తానంటూ ఆయన చేసిన సవాళ్ పై తల పట్టుకుని కూర్చున్నాడట.

మాట మీద నిలబడతూ రాజకీయాలనుంచి నిజంగా తప్పుకుందామా.. వద్దా సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నాడట. ఇంకోవైపు భారీ మెజార్టీతో విజయం అందుకున్న భూమా కుటుంబం సంబరాలు చేసుకుంటోంది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లు.. జ‌గ‌న్ను, భూమా బ‌ద్ధ శ‌త్రువు శిల్పాను క‌సితో జ‌యించినందుకు వాళ్ల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. వయసులో చిన్నవారమైనా ఇక కర్నూల్ జిల్లాలో తమకు తిరుగులేదని భావిస్తున్నారట. ఓడించింది ఒక్క అభ్యర్ధినే అయినా, బలమైన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న జగన్ పార్టీని మట్టికరిపించటంలో ఉన్న కిక్కే వేరు అని మురిసిపోతున్నారట. ప్రధానంగా.. మంత్రి అఖిలప్రియకు ఇక నంద్యాల, ఆళ్లగడ్డలు తమను ధాటి ఎప్పటికి, ఎవరి చేతుల్లోకి వెళ్లవని క్లారిటీ వచ్చేసిందట. వచ్చే ఎన్నికల్లో ఇక పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారట.

అయితే రాజకీయంగా తండ్రి భూమా నాగిరెడ్డితో పాటు, తన పై కూడా కక్ష కట్టిన శిల్పా బ్రదర్స్ ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్తోంది. ముఖ్యంగా ఎన్నిక ముందే ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని శిల్పా చేసిన సవాల్ ను స్వీకరించేదాకా పరుగులు పెట్టేస్తానంటూ గర్వంగా చెప్తోంది. గత ఎన్నికల్లోనూ భూమా నాగిరెడ్డి గెలిస్తే శిల్పా బ్రదర్స్ పారిపోయారని, ఇక ఈసారైతే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పేదాకా వద్లిపెట్టనని చేప్తోంది అఖిల ప్రియ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -