Tuesday, May 14, 2024
- Advertisement -

ఎన్టీఆర్ మీద కోపంగా ఉన్న ఎన్టీఆర్ ఫాన్స్

- Advertisement -

ఈ మధ్య కాలం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా మారిపోయాడు. ఆహార్యం , బాడీ , బాడీ లాంగ్వేజ్, ఎంచుకునే సబ్జెక్ట్ లూ, పారితోషికం, డైరెక్టర్ లో ఇలా ఒక్కటి కాదు అన్ని విషయాలలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు ఈ నందమూరి హీరో. టెంపర్ , నాన్నకు ప్రేమతో లాంటి రెండు ప్రయోగాత్మక చిత్రాలలో విలక్షణ పాత్రలు చేసిన ఎన్టీఆర్ ఊపిరి లాంటి సినిమాని మిస్ అయ్యాడు అని ఫాన్స్ తెగ బాధ పడుతున్నారు.

నిన్న విడుదల అయిన ఊపిరి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికే మనం , సోగ్గాడు చిన్ని నాయన తో ఊపు మీద ఉన్న నాగార్జునకి ఈ సినిమా మరొక సూపర్ హిట్ ని ఇచ్చి హ్యాట్రిక్ పూర్తి చేయించింది. ఈ మధ్యకాలంలో వచ్చిన మల్టీస్టారర్ సినిమాల్లో ఊపిరి సినిమా ఒక్కటే ఇద్దరు హీరోలకు సమానమైన పాత్రలను కలిగిఉంది.

అలాంటి సినిమాల్లో నాగ్ కి తోడు ఎన్టీఆర్ కూడా చేసి ఉంటే ప్యూర్ క్లాసిక్ గా మారేదని ఎన్టీఆర్ అభిమానులు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు సినిమా చూశాక ఎన్టీఆర్ కూడా అలాగే ఫీల్ అవ్వడం ఖాయం. ఒకరకంగా ఎన్టీఆర్ మీద అతని ఫాన్సు సీరియస్ గా ఉన్నారు అని చెప్పచ్చు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -