Friday, April 26, 2024
- Advertisement -

ఎన్టీఆర్ షూ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

- Advertisement -

స్టార్‌ హీరో, హీరోయిన్లు ఏం చేసినా అభిమానులకు గొప్పే. వారు వేసుకునే దుస్తుల నుంచి మొదలు.. ధరించే వాచ్‌, హెయిర్‌ స్టైల్‌, లుక్‌ ఇలా అన్ని అభిమానులు ఫాలో అవుతుంటారు. ఇక హీరోలు సైతం తమ అభిమానులను నచ్చేలా, కొత్త కొత్తగా రెడీ అవుతారు. మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్లు అయితే లక్షలకు లక్షలు పోసి వాచీలు, డ్రెస్సులు తెచ్చుకుని ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌ ఇస్తారు. ఇక కొత్త లుక్‌లో తమ హీరోలను చూసి అభిమానులు మురిసిపోతుంటారు. వారు ధరించిన డ్రెస్సులు, వాచీలు, షూలు ఎంత ఖరీదైనవో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు.తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ లుక్‌, స్టైల్ కు సంబంధించిన వార్తొకటి నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది. అదేంటంటే.. ఎన్టీఆర్‌ షూస్‌ గురించి. అందులో ఏముందంటారా? తారక్‌ వేసుకున్న షూ .. హెర్మస్‌ కంపెనీకి చెందింది.

ఇక తారక్ వేసుకున్న HERMES బ్రాండ్ షూస్ గమనించిన ఫ్యాన్స్ గూగుల్‌లో వాటి ధర ఎంతో అని తెగ వెతుకుతున్నారు. ఈ బ్రాండ్ షూస్ కేవలం సెలబ్రిటీస్ మాత్రమే వాడుతుంటారట. ఎందుకంటే వాటి ఖరీదు అక్షరాల 75000/- ఇది మా యంగ్ టైగర్ రేంజ్ అంటూ కొందరు అభిమానులు షూస్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వాటిని వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్‌ ఏ వస్తువులు వాడినా అవి తెగ వైరల్ అవుతుంటాయి. ఫ్యాన్స్ వాటిని అనుకరిస్తూ ఉంటారు. అప్పట్లో రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్లికి వచ్చినపుడు ఈయన పెట్టుకున్న వాచ్ కూడా ఫేమస్‌ అయిపోయింది. దాని విలువ దాదాపు 30 లక్షలకు పైగానే ఉండటంతో ఎన్టీఆర్ వాచ్ న్యూస్ వైరల్ అయిపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -