Saturday, April 20, 2024
- Advertisement -

మైదానంలో ఉల్లి సాగు.. రైతుల కొత్త నిరసన..!

- Advertisement -

నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమిస్తోన్న అన్నదాతలు ఆందోళనలను ఉద్ధృతం చేశారు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసన 32వ రోజుకు చేరగా అటు, రైతు సంఘాల నేతలు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలోని నిరంకారీ మైదానంలో రైతులు ఉల్లి సాగు చేస్తున్నారు. వీటిని తమ రోజువారీ వంట కార్యక్రమాలకు ఉపయోగిస్తామని వారు తెలిపారు. మైదానంలో మరిన్ని పంటలు పండిస్తామని వెల్లడించారు. చట్టాలను రద్దు చేసేంత వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సింఘు, టిక్రీ, గాజీపూర్‌, చిల్లా సరిహద్దుల వద్ద రైతులు బైఠాయించారు. ఈ నెల 30న ఢిల్లీ-జయపుర హైవేపై ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు.మరోవైపు, కేంద్రంతో మరోసారి చర్చలు జరిపేందుకు అంగీకారం తెలిపిన రైతులు… 4 అంశాలతో చర్చల అజెండాను ప్రతిపాదించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -