Sunday, April 28, 2024
- Advertisement -

పుట్టిన రోజున ఎన్టీఆర్ కొత్త సినిమా ఫ‌స్ట్ లుక్‌!

- Advertisement -

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ వ‌రుస హిట్ల‌తోదూసుకుపోతున్నాడు.టెంప‌ర్,నాన్న‌కు ప్రేమ‌తో,జ‌న‌తా గ్యారేజ్ ,జైల‌వ‌కుశ ఇలా వ‌రుస హిట్ల‌తో మంచి జోష్‌లో ఉన్నాడు.ఎన్టీఆర్ ప్ర‌స్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ డైర‌క్ష‌న్లో ఓ మూవీ చేస్తున్నాడు.ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌లో బిజి ఉన్నాడు. అజ్ఞాత‌వాసి ఫ్లాప్ త‌రువాత త్రివిక్ర‌మ్ తీస్తున్న సినిమా కావ‌డంతో సినిమాపై కొంతమెర అనుమానాలు ఉన్నా ఎన్టీఆర్ ఈ మ‌ధ్య వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకోవ‌డంతో సినిమాపై భ‌రోసా ఏర్ప‌డింది.

న‌గ‌ర శివార్ల‌లో సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ నెల‌(మే) 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా అభిమానుల కోసం ఎన్టీఆర్ ఫ‌స్ట్ లుక్‌ని రీలిజ్ చేయ‌ల‌ని భావిస్తుంది చిత్ర యూనిట్‌.దానికి సంబంధించిన ఫోటో సెష‌న్‌లో ఎన్టీఆర్ పొల్గొన్నాడ‌ని స‌మాచారం.ఈ సినిమాలో ఎన్టీఆర్ ప‌క్క‌న హీరోయిన్‌గా పూజ హెగ్డె న‌టిస్తుంది. ఆమె రీసెంట్‌గా సినిమా షూటింగ్‌లో జాయిన్ అయింద‌ని తెలుస్తుంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -