Monday, May 5, 2025
- Advertisement -

ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ సినిమా..?

- Advertisement -
ntr under konidela production

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటుడిగా చేస్తునే.. నిర్మాణ రంగంలో కూడా అడుగుపెట్టారు. కొణిదెల ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో మొదటి సినిమాగా ఖైదీ నంబర్ 150 చిత్రంను నిర్మించి సక్సస్ ఫుల్ నిర్మాతగా అనిపించుకున్నారు. ఇప్పుడు తాను సుకుమార్ దర్శకత్వంలో హీరోగా చేస్తూ, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే సినిమాని నిర్మిస్తున్నారు.

రెండో సినిమాని కూడా తండ్రి చిరంజీవితోనే తీస్తుండడం విశేషం. అయితే బడా హీరోలతోనే కాకుండా.. యంగ్ హీరోలతో సినిమాలు నిర్మించే ఆలోచనలో రామ్ చరణ్ ఉన్నారు. మెగాస్టార్ సినిమా కంప్లీట్ అవ్వగానే శర్వానంద్, అఖిల్ తో సినిమాలను చేయనున్నారు. ఇందుకు స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాత  ఓ క్రేజీ ప్రాజక్ట్ చేయాలని చెర్రీ భావిస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పెట్టి భారీ బడ్జెట్ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ కలయికలో తెరకెక్కనున్న ఈ సినిమా రికార్డులను తిరగరాస్తుందని అంచనా వేస్తున్నారు. చెర్రీ తన మిత్రుడు ఎన్టీఆర్ తో ఈ విషయాన్నీ త్వరలోనే చెప్పి ఒప్పించేందుకు ట్రై చేస్తున్నాడట. ఈ సినిమా ఒకే కావాలని నందమూరి, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Related

  1. టాప్ దర్శకుడితో ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్!
  2. రికార్డు సృష్టించబోతున్న ఎన్టీఆర్!
  3. మహేష్, ఎన్టీఆర్, అఖిల్ గురించి షాకింగ్ నిజాలు చెప్పిన చిరు!
  4. ఎన్టీఆర్ రికార్డులను బద్దలు కొట్టిన రామ్ చరణ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -