Tuesday, April 30, 2024
- Advertisement -

ఎన్టీఆర్ రికార్డులను బద్దలు కొట్టిన రామ్ చరణ్!

- Advertisement -
ram charan ntr dhruva movie beats janatha garage

ప్రస్తుతం పరిశ్రమలో వారసత్వపు హీరోల హవా నడుస్తోంది. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాన్ రామ్ లు మంచి స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అరడజను మంది హీరోలు వచ్చారు. వారంత తమ సత్తా చాటుతున్నారు. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్ గత రెండు సంవత్సరాలుగా వరుస హిట్లతో దూసుకెళ్తున్నాడు. ఇక డిసెంబర్ లో రాంచరణ్ నటించిన ‘ధృవ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

రెండు ప్లాప్‍ల తర్వాత మంచి విజయం సొంతం చేసుకున్నాడు రాంచరణ్. తాజాగా రాంచరణ్ ‘ధృవ’ సినిమాతో ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ రికార్డ్ ని బద్దలు కొట్టాడు. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో గల మెయిన్ థియేటర్ లో ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ మొత్తం మీద 94 లక్షల 66 వేల రూపాయలను వసూల్ చేయగా చరణ్ నటించిన ధృవ ఆ రికార్డ్ ని బద్దలు కొట్టి 95 లక్షల 11 వేలతో సరికొత్త రికార్డ్ ని నమోదు చేసింది.

ఇక చరణ్ ధృవ విషయానికి వస్తే తమిళంలో ఘనవిజయం ఘనవిజయం సాధించిన తని ఒరువన్ చిత్రాన్ని రీమేక్ చేసారు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా చరణ్ కు వెరీ వెరీ స్పెషల్ గా నిలిచింది. మొత్తం మీద గత సంవత్సరం ఈ ఇద్దరు స్టార్ హీరోలకు మంచి సక్సెస్‍లు అందుకున్నారు.

Related

  1. ప‌వ‌న్‌ ల‌వ‌ర్‌.. ఇప్పుడు చరణ్ కి అత్త‌!
  2. చరణ్ కి అఖిల్ కి మధ్య ఉన్న సంబంధం ఇదే!
  3. డైరెక్టర్ మాజీ భార్య తో చరణ్ రొమాన్స్!
  4. బాల‌య్య‌పై.. షాకింగ్ కామెంట్స్ చేసిన చరణ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -