Tuesday, May 21, 2024
- Advertisement -

రికార్డు సృష్టించబోతున్న ఎన్టీఆర్!

- Advertisement -
tollywood film in history a record of new business for ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త చిత్రం ఇంకా షూటింగ్ మొదలు కాకముందే బిజినేస్ మాత్రం రికార్డు సృష్టిస్తోంది. ఎన్టీఆర్ కు వరసగా మూడు సూపర్ హిట్స్ రావడంతో పాటు జ‌న‌తా గ్యారేజ్ ఎన్టీఆర్ కేరీర్‌లోనే అత్య‌ధికంగా కలెక్షన్స్ రాబట్టడంతో.. స‌హ‌జంగానే ఎన్టీఆర్ తర్వాత సినిమా ఓ రెంజ్ లో అంచనాలు ఉన్నాయి.

ఎన్టీఆర్ కొత్త సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ఎన్టీఆర్ అన్న నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ నిర్మిస్తుండగా.. బాబి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా షూటింగ్ మొదలు కాకుండానే ఈ చిత్రంకు సీడెడ్ ఏరియా నుంచి షాకింగ్ ప్రి రిలీజ్ బిజినెస్ ఆఫ‌ర్ వ‌చ్చింది.

ఈ చిత్రం రైట్స్ సొంతం చేసుకునేందుకు సీడెడ్‌లో ఓ బ‌డా డిస్ట్రిబ్యూట‌ర్ ఈ చిత్ర హ‌క్కుల కోసం ఏకంగా రూ.14.75 కోట్లు ఆఫర్ చేశాడట. ఈ డీల్ ఓకే అయితే టాలీవుడ్ హిస్ట‌రీలోనే ఇదే రికార్డు అవుతుంది. ఇక్కడ ఇప్పటి వరకు పవన్ సర్ధార్ గబ్బర్ సింగ్ అత్య‌ధికంగా రూ.12 కోట్ల‌కు పైగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. మరి ఎన్టీఆర్ సినిమా ఇక్క‌డ రూ 14.75 కోట్ల‌కు అమ్ముడు పోతే పవన్ రికార్డులను బ్రేక్ చేసినట్లే.

Related

  1. ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్!
  2. నితిల్ లవ్ గురించి ఎన్టీఆర్ కు తెలుసా?
  3. ఎన్టీఆర్ ఆస్తి ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే!
  4. ఎన్టీఆర్ మళ్లీ ఎందుకు లావు అయ్యాడో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -