Friday, May 17, 2024
- Advertisement -

టాప్ దర్శకుడితో ఎన్టీఆర్ కొత్త సినిమా ఫిక్స్!

- Advertisement -

NTR 28 movie Director Fix

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ టెంప‌ర్, నాన్న‌కుప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్ లాంటి మూడు వరస బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ల‌తో కేరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఈ నెపథ్యంలో గ్యారేజ్ త‌ర్వాత చాలా గ్యాప్ తీసుకుని ప‌వ‌ర్, స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగ్ చిత్రాల దర్శకుడు బాబి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత సెప్టెంబర్ నుంచి త్రివిక్రమ్ సినిమా చేయాలని ఆయన ప్లాన్ చేసుకున్నాడు. అయితే త్రివిక్ర‌మ్ పవన్‌తో ఓ పొలిటిక‌ల్ స్టోరీతో మూవీ చేస్తున్నాడు. ప్ర‌స్తుతం కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తోన్న ప‌వ‌న్ ఈ మూవీ తర్వాత త్రివిక్ర‌మ్ సినిమాలో న‌టిస్తాడు. ఇక జ‌న‌తా గ్యారేజ్ త‌ర్వాత స‌రైన ప్లానింగ్ లేక‌పోవ‌డంతో చాలా రోజుల పాటు ఖాళీగా ఉన్న ఎన్టీఆర్ ఇక‌పై వ‌రుస‌గా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం బాబి దర్శకత్వంలో ఎన్టీఆర్ న‌టిస్తోన్న సినిమా 27వ సినిమా కాగా.. ఇక త‌న 28వ సినిమాను మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడ‌ట‌. త‌న నెక్ట్స్ సినిమాను ఎన్టీఆర్ వినాయ‌క్ డైరెక్ష‌న్‌లో చేయ‌డం దాదాపు ఖ‌రారైనట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం వినాయ‌క్ ఎన్టీఆర్ సినిమా కోసం క‌థ‌ను డ‌వ‌ల‌ప్ చేసే ప‌నిలో ఉన్నాడ‌ట‌. ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా వెల్ల‌డికానున్నాయి.

Related

  1. అబ్బే.. ఎన్టీఆర్ ఏ మాత్రం మారలేదు
  2. ఎన్టీఆర్ గడ్డం పెంచడం వెనక కారణం ఇదే!
  3. ఎన్టీఆర్ రికార్డులను బద్దలు కొట్టిన రామ్ చరణ్!
  4. ఎన్టీఆర్ కోసం వచ్చిన హాలీవుడ్ టెక్నీషియన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -