టాలీవుడ్ చరిత్ర లో హిట్ లు కొట్టినా ఫట్ కొట్టినా కొన్ని సెంటిమెంట్ లు మాత్రం గట్టిగా ఫాలో అయ్యిపోతూ ఉంటారు. హీరో అయినా , డైరెక్టర్ అయినా , నిర్మాత అయినా ప్రతీ ఒక్కరూ ఎదో ఒక సెంటిమెంట్ తో బలంగా నమ్ముకుని ఉంటారు. అది ఫాలో అయినప్పుడల్లా హిట్ కొడతారు అనేమీ లేదు ఛాన్స్ తీసుకుంటారు అంతే.
పోనీ ప్లాప్ ఒచ్చాక సెంటిమెంట్ ని ఒదిలేస్తారా అంటే అదేమీ ఉండదు. ఇలాంటి ఒక సెంటిమెంట్ ఎన్టీఆర్ కి బాగా ఉంది అని అంటున్నారు. ఇప్పటి వరకూ ఎన్టీఆర్ కమిట్మెంట్ ఇచ్చి చేస్తాను అని చెప్పి ఇతర కారణాల వలన చెయ్యకుండా ఒదిలేసిన సినిమా వేరే హీరోకి వెళితే బ్లాక్ బస్టర్ అవడం ఇక్కడి సెంటిమెంట్.
ఎన్టీఆర్ ఇలాగే దిల్, ఆర్య, కిక్, కృష్ణ, మిర్చి, భద్ర లాంటి సినిమాలను మిస్ అయ్యాడు, కానీ ఆ సినిమాలు చేసిన వేరే హీరోలు మాత్రం సూపర్ హిట్లు కొట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తాను అని చెప్పి మిస్ అయిన నాగార్జున-కార్తీల ఊపిరి సినిమాపై కూడా ఇలాంటి అంచనాలే నెలకొన్నాయి. సో ఎన్టీఆర్ నో చెప్పాడు కాబట్టి కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని అంటున్నారు.