Friday, March 29, 2024
- Advertisement -

తెలుగువారు గర్వించదగ్గ మూవీ ఇది: మెగాస్టార్

- Advertisement -

తెలుగు తెరపై ప్రస్తుతం సీనియర్ హీరోల హవా నడుస్తోంది. అందులో చాలా గ్యాప్ తర్వాత అక్కినేని యువ సామ్రాట్ నాగార్జున ‘వైల్డ్ డాగ్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రజల్లో మాంచి రెస్పాన్సే తెచ్చుకుంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 2 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక ఈ ‘వైల్డ్ డాగ్’ సినిమాను చూసిన మెగాస్టార్ చిరు ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ‘వైల్డ్ డాగ్ సినిమాను ఇప్పుడే చూశాను. ప్రతి ఒక్కరూ చూడాల్సిన మూవీ ఇది. రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే టెర్రరిస్ట్ దాడులు, జవాన్ల చర్యలు వంటి అంశాలను కళ్లకు కట్టినట్టు చూపించారు. రియల్ హీరోల ధైర్యాన్ని.. సాహసాలను చూపించడానికి.. నాగార్జున, దర్శకుడు, వైల్డ్ డాగ్ టీం, నిర్మాత ఎంతగానో కష్టపడ్డారు.

వారికి అభినందనలని ట్విట్టర్ వేధికగా చిరు తెలిపారు. తెలుగు వారు గర్వంగా చూడాల్సిన మూవీ ఇదని అన్నారు చిరంజీవి. డోంట్ మిస్.. వాచ్ ఇట్ అని చెప్పుకొచ్చారు మెగాస్టార్ చిరంజీవి. ఇక వైల్డ్ డాగ్ సినిమా రిలీజయ్యి ప్రేక్షకుల నుంచి కూడా మంచి ఆదరణను సంపాదించుకుంది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఓ ట్రెండ్ సెట్ట‌ర్ !

అల్లు అరవింద్‌కు కరోనా.. ఏం జరిగిందంటే !

జుట్టు రాలుతోందా.. అయితే ఈ చిట్కాలను పాటించండి

కొండెక్కిన కోడి.. క‌రోనానే కార‌ణ‌మా?

ఇండోనేషియాలో వదర బీభత్సం.. 75 మంది మృతి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -