Friday, May 3, 2024
- Advertisement -

మరొక చంద్రముఖి తో రజినీకాంత్

- Advertisement -

భారతీయ చలన చిత్ర పరిశ్రమ లో సూపర్ స్టార్ రజినీకాంత్ లెక్క వేరు. ఆయన అడుగు పెడితే రికార్డుల వేట మొదలు అవాల్సిందే. ఆయన సినిమా అంటే కాసుల మొత్తం మొగాల్సిందే . అలాంటిది ఈ మధ్య కాలం లో తీవ్రమైన కష్టాలు అనుభవిస్తున్నారు ఆయన.

వరస ప్లాపులతో సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ ప్లాపులు తననీ , తన మార్కెట్ నీ టచ్ కూడా చెయ్యలేవు అని నిరూపిస్తూ తన తరవాతి సినిమాకి 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ని చేసారు. కుర్ర హీరోలకి దిమ్మ తిరిగే రేంజ్ లో ఈ సినిమా వ్యాపారం సాగుతోంది. రజినీకాంత్ సినిమా లలో చంద్రముఖి కి ఇంకా మంచి స్థానం ఉంది. 2005 లో వచ్చిన ఈ సినిమా సాధించిన రికార్డులు అప్పట్లో చాలా పెద్ద సంచలనం.

అప్పట్లో కన్నడ నాట ఒచ్చిన ఆప్త రక్షక సినిమా కి రీమేక్ గా వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపింది.  ఇప్పుడు పి.వాసు రజినీకాంత్ కోసం ఒక రీమేక్ సినిమాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కన్నడలో ఆయన దర్శకత్వంలో శివకుమార్ హీరోగా తెరకెక్కిన శివలింగా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా కూడా చంద్రముఖి టైప్ సస్పెన్స్ థ్రిల్లర్ అవ్వడంతో రజినీకాంత్ తో చేస్తే సౌత్ మొత్తం షేక్ అవుతుందని వాసు అనుకుంటున్నాడట. రజినీకాంత్ మాత్రం రోబో 2 అయ్యాకే తన నిర్ణయం చెబుతానని చెప్పాడట.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -