Sunday, May 12, 2024
- Advertisement -

చివ‌రి వ‌ర‌కు వైసీపీలోనె కొన‌సాగుతాం…

- Advertisement -

అధికార టీడీపీ నుంచి ప్ర‌తిప‌క్ష వైసీపీలోకి వ‌చ్చి క‌ర్నూలు జిల్లాలో సంచ‌ల‌నం సృష్టించారు శిల్పా బ్ర‌ద‌ర్స్‌. ఆరు సంవ‌త్సరాలపాటు ఎమ్మెల్సీ ప‌ద‌వికి ఉన్నా దానికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి. ఉప ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ర్వాత వారిపై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేశారు టీడీపీ మంత్రులు, నాయ‌కులు. వాట‌న్నింటికి చెక్ పెట్టేందుకు ఇప్పుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు.

ఎవ‌రు ఎన్ని విమ‌ర్శ‌లు చేసినా మా క‌మిట్ మెంట్ మార‌దంటున్నారు శిల్పా బ్ర‌ద‌ర్స్‌. చివ‌రి వ‌ర‌కు వైసీపీలోనె కొన‌సాగుతామ‌ని తేల్చి చెప్పారు. అయితే శిల్పా ఫ్యామిలీని విడ‌దీసి ఒక‌రిని టీడీపీలో క‌లుపుకోవ‌డానికి అధికార పార్టీ నాయ‌కులు పావులు క‌దుపుతున్నారు. వీట‌న్నింటికి చెక్ పెట్టారు.

నంద్యాల‌లో ఓట‌మి చెందినంత మాత్రాన వెన‌క‌డుగు వేసె ప్ర‌స‌క్తే లేద‌ని శిల్పా వ‌ర్గం, ఆయ‌న అనుచ‌రులు చెప్పారు. ఎన్నిక‌లో భూమా కుటుంబంమీద ఉన్న సానుభూతి, డ‌బ్బులు, అధికార దుర్విన‌యేగంతో టీడీపీ గెలించింద‌ని…వ‌చ్చే ఎన్నిక‌ల్లో అలాంటివి ప‌నిచేయ‌వ‌ని వారు చెప్తున్నారు. వైసీపీనీ వీడె ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చి చెప్పారు శిల్పా బ్ర‌ద‌ర్స్‌.

నంద్యాల‌లో ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పును గౌర‌విస్తున్నామ‌ని…మ‌ళ్లీ పుంజుకుంటామ‌ని వెల్ల‌డించారు. లోపాలు ఎక్క‌డున్నాయో స‌రిచేసుకుంటామంటున్నారు. త‌మ అనుచ‌ర వ‌ర్గాన్ని, పార్టీ క్యాడ‌ర్‌ను మ‌రింత ప‌టిష్టం చేసె ప‌నిలో ఉన్నామ‌న్నారు.

ఓట‌మిని ఛాలెంజ్‌గా తీసుకొని వారి నియేజ‌క వ‌ర్గాల్లో పార్టీని ప‌టిష్టం చేయ‌నున్నారు. వైసీపీలో చేరేముందు శ్రీశైలం నియేజ‌క వ‌ర్గ సీటును శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డికి ఇస్తాన‌ని జ‌గ‌న్ మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ నియేజ‌క వ‌ర్గంలో ఫోక‌స్ పెట్టారు. ప‌డి లేచిన కెర‌టంలా వారు మ‌రింత దూకుడు పెంచ‌నున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -