Sunday, May 19, 2024
- Advertisement -

పవన్ ఫ్యాన్స్ కక్ష్య తీర్చుకుంటున్నారు!

- Advertisement -

భారీ అంచనాలతో నిన్న భారీ థీయేటర్స్‌లో మహేష్ బ్రహ్మోత్సవం రిలీజ్ అయింది. మహేష్, కాజల్, సమంత, ప్రణతీ కాంబినేషన్‍లో వచ్చిన ఈ చిత్రన్నికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించాడు. రిలీజ్ అయిన మొదటి షో నుంచి ఈ చిత్రం నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. భారీ అంచనాలు పెట్టుకున్న మహేష్ ఫ్యాన్స్‌ని ఈ చిత్రం అలరించలేకపోయింది.

కథ లో దమ్ము లేకపోవడం కథనం అసలు బాగలేకపోవడం వల్ల ఈ చిత్రం అభిమానులను అలరించడంలో విఫలం అయింది. కలక్షన్స్ కూడా ఈ చిత్రాన్నికి ఇప్పుడు అంతంతా మాత్రమే ఉన్నాయి. ఇక ఈ చిత్రంపై సోషల్ మీడియాలో ఇది బ్రహ్మోత్సవం కాదు ఫ్లాపోత్సవం అంటూ చీల్చి చెండాడుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఆ సినిమాకు డివైడ్ టాక్ రావడంతో పవన్ ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు . రెచ్చిపోయి సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు . పవన్ ఫ్యాన్స్ ఇంతగా రెచ్చిపోయి పండగ చేసుకోవడానికి కారణం ఏంటో తెలుసా….

కొద్దిరోజుల క్రితం పవన్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయి దానికి కూడా డివైడ్ టాక్ రావడంతో అప్పట్లో మహేష్ ఫ్యాన్స్ కూడా రెచ్చిపోయి సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయ్యిందని పండగ చేసుకున్నారు. పైగా సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు విసిరారు. ఆ సమయంలో మహేష్ ఫ్యాన్స్ చేసిన హంగామా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కక్ష్య తీర్చుకుంటున్నారు . అదీ విషయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -