Sunday, May 19, 2024
- Advertisement -

ఈసారి మహేష్ పై పడ్డాడు!

- Advertisement -

రాజకీయాలు, సినిమా రంగంలో జరిగే విషయాలపై ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే వర్మ… ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలు విడుదలైనపుడు తనదైన కామెంట్లతో ట్విట్టర్లో వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సమయంలో వర్మ క్రియేట్ చేసిన ట్వీటు దుమారం గురించి ఫ్యాన్స్ ఎవరూ మరిచిపోలేదు.

తాజాగా మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ రిలీజైన నేపథ్యంలో వర్మ మరోసారి తన ట్విట్టర్లో కామెంట్స్ చేసారు. బ్రహ్మోత్సవం సినిమా పేరు ఎత్తకుండా మహేష్ బాబుకు హిత బోధ చేసాడు. మహేష్ బాబును కూడా పేరుతో పిలవకుండా మిస్టర్.ఎం అంటూ సంబోధింస్తూ క్లాస్ పీకాడు.

హ్మోత్సవం చిత్రంలోని మహేష్ డ్యాన్స్ చేస్తున్న వీడియో ని ట్విట్టర్ లో పోస్ట్ చేసి ……… అదేదో సామెత లా తెలియని విధంగా ,బాగా తగిలేలా తిట్ల వర్షం కురిపించాడు సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ . 

 ఎప్పుడు చూసినా మెగా ఫ్యామిలీ హీరోలపై సెటైర్లు వేసే రాంగోపాల్ వర్మ ఈసారి మహేష్ పై పడ్డాడు . మహేష్ డ్యాన్స్ చూసి ఇంటర్నేషనల్ డ్యాన్సర్ లు డ్యాన్స్ ఎలా చేయాలో నేర్చుకోవాలని పరోక్షంగా మహేష్ నే తిట్టాడు . అంతేనా శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలు మాత్రమే ఫ్యామిలీ సినిమా చేస్తారు కానీ కృష్ణ , ఎన్టీఆర్ లు కాదని మరో ఘాటు విమర్శ కూడా చేసాడు వర్మ . ఓవరాల్ గా వర్మ చేసిన ట్వీట్ ల సారాంశం ఏమిటంటే ”బ్రహ్మోత్సవం ” ఓ చెత్త సినిమా అని , మహేష్ డ్యాన్స్ ఇంకా పరమ చెత్త అని . నేను చేసింది విమర్శలు కాదు పాజిటివ్ గా తీసుకోండి అంటూ కొసమెరుపు కూడా ఇచ్చాడు వర్మ .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -