Monday, May 13, 2024
- Advertisement -

రిలీజ్ కు ముందే రికార్డులు సృష్టిస్తున్నాయి!

- Advertisement -

టాలీవుడ్ లో చిరు తర్వాత నెంబర్ వన్ స్థానంలో పవన్ కళ్యాణ్ – మహేష్ బాబులే పోటీ పడుతున్నారు. ఈ ఇద్దరి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే అభిమానులో భారీగా క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా రికార్డుల విషయంలో వీళ్లిద్దరిలో ఒకరు తక్కువ ఇంకొకరు ఎక్కువ అని చెప్పడం కష్టం.

ఒకరు మార్చి ఒకరు రికార్డుల మోత మోగిస్తూనే ఉంటారు. ఇప్పుడీ వేసవిలో ఈ ఇద్దరు సూపర్ స్టార్ల మధ్య మరోసారి బాక్సాఫీస్ సమరానికి రంగం సిద్ధమవుతోంది. పవన్ సర్దార్ తో అలాగే మహేష్ బ్రహ్మోత్సవం తో ఈ రెండు సినిమాలో ఏది  దేనిపై పైచేయి సాధిస్తుంది.. ఏది ఎలాంటి రికార్డు నెలకొల్పుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.

ఐతే రిలీజ్ కు ముందే ఈ రెండు సినిమాలు రికార్డులు సృష్టిస్తున్నాయి. బిజినెస్.. శాటిలైట్ రైట్స్ విషయంలో ఈ రెండు సినిమాల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది. సర్దార్ మూవీ శాటిలైట్ రైట్స్ రూ.13 కోట్లు పలికిన సంగతి తెలిసిందే. తాజాగా బ్రహ్మోత్సవం శాటిలైట్ హక్కుల్ని ఓ ప్రముఖ ఛానెల్ రూ.11.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక్కడ కోటిన్నర వెనకబడ్డ మహేష్.. ఇంకో విషయంలో పవన్ పై అంతే తేడాతో పైచేయి సాధించడం విశేషం.

బ్రహ్మోత్సవం సినిమా ఓవర్సీస్ రైట్స్ రూ.13 కోట్లకు పలికి టాలీవుడ్ లో సరికొత్త రికార్డు నెలకొల్పగా.. సర్దార్ గబ్బర్ సింగ్ రూ.11.5 కోట్లతో దానికి దగ్గరగా వచ్చింది.  మహేష్ ఓవర్సీస్ రైట్స్ విషయంలో పైచేయి సాధిస్తే.. పవన్ శాటిలైట్ పరంగా ఆధిపత్యం చలాయించాడు. సినిమాలు రిలీజ్ కాకముందే సంచలనం సృష్టిస్తే మరి సినిమాలు రిలీజ్ అయ్యాక ఇంకేన్ని రికార్డులు సృష్టిస్తారో మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -