ఆ మధ్య సరైనోడు సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ “చెప్పను బ్రదర్” డైలాగ్ చెప్పడంతో అల్లు అర్జున్, పవన్ మధ్య దూరం పెరిగినట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అయితే పవన్ పేరు ఎందుకు చెప్పలేదో తర్వాత బన్నీ క్లారీటి ఇచ్చాడు అనుకోండి. అయితే మెగా ఫ్యామిలీ హీరోలకు సంబంధించి ఏ హీరో సినిమా ఆడియో పంక్షన్ అయిన అందరూ హీరోలు ఆ వేడుకకు హాజరవుతుంటారు. అయితే మెగా ఫ్యామిలీ హీరోలు అంటే అల్లూ హీరోలు కూడా వస్తారు కాబట్టి అల్లు హీరోలు కూడా మెగా హీరోలగే చూస్తారు.
అయితే పవన్ కళ్యాణ్ మెగా హీరోల సినిమా ఆడియోలకు రావడం చాలా తక్కువే. మెగా హీరోలకు సంబంధించిన ఆడియో వేడుకలకు పవన్ హజర్ అవుతే అది మెగా హీరోలకు పెద్ద పండగే. ఇక పవన్ సర్ధార్ గబ్బర్ సింగ్ ఆడియో కు చిరు వచ్చిన విషయం తెలిసిందే.
ఇప్పుడు చిరు ఖైదీ నెం 150 అనే సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆడియోని గ్రాండ్ గా చేయబోతున్నారంట ఈ సినిమా నిర్మాత రామ్ చరణ్. ఈ వేడుకకు మెగా హీరోలతో పాటు పవన్ కూడా రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ మాత్రం అల్లు హీరోలు వస్తే.. తాను ఆ ఫంక్షనుకు వెళ్లడనే టాక్ టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలియదు కానీ పవన్ ఈ వేడుకకు రప్పించే ప్రయత్నం చేస్తున్నాడట చరణ్. సో పవన్ ఈ వేడుకకు వస్తారో లేదో తెలియాలంటే చిరు సినిమా ఆడియో అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
{youtube}k6fuu9LFsiU&t=18s{/youtube}
Related