Monday, May 6, 2024
- Advertisement -

సుమకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పవన్!

- Advertisement -
pawan kalyan shocking question to suma

ఇప్పుడు ఉన్న యాంకర్స్ లో స్టార్ యాంకర్ ఎవరు అంటే వెంటనే అందరూ చెప్పేది సుమ కనకాల పేరే. స్క్రిప్ట్ లేకుండా గంటల తరబడి షోలను అవలీలగా నడిపిస్తుంది. తన స్పాంటేనియస్ తో నవ్వులు పూయిస్తుంది. వేగంగా మాట్లాడి స్టార్ హీరోలను సైతం బురిడీ కొట్టించే ఈ యాంకర్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దొరికిపోయింది. తన పొరబాటుని కప్పిపుచ్చుకోవడానికి వీలులేకుండా పోయేసరికి.. టాపిక్ డైవర్ట్ చేసింది. విషయంలోకి వెళ్తే.. కొన్ని రోజుల క్రితం ఓ టీవీ ఛానల్ కోసం సుమ, పవన్ ని ఇంటర్వ్యూ చేసింది.

అందులో భాగంగా.. పవన్ కళ్యాణ్ గదిలో ఉన్న పుస్తకాలను చూసి రీడింగ్ అంటే స్బాగా ఇష్టమా? అని ప్రశ్నించింది. అందుకు పవన్ అవును నాకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టమని చెప్పుకొచ్చారు. స్కూల్ లోను బాగా చదివే వారా? అని సుమ అడిగితే… “నాకు చిన్నప్పుడు చదువు మీద శ్రద్ద ఉండేది కాదు. ఎందుకంటే వారు చెప్పేది నాకు అర్ధమయ్యేది. ఒక ఆస్ట్రానమీ మాత్రమే ఆసక్తికరంగా అనిపించేది” అని పవన్ చెబుతుండగానే.. మధ్యలో స్టార్ యాంకర్ కల్పించుకుని.. అయితే సోషల్ అంటే మీకు ఇష్టం అన్న మాట అంటూ వాగేసింది.

ఆ  వాగుడులోనే సుమ జ్ఞానం పవన్ ని తెలిసింది. అయినా ఆమెను కించపరచకుండా, చిన్న నవ్వు నవ్వి.. ఆస్ట్రానమీ అంటే సోషల్ కాదు.. ఖగోళ శాస్త్రం అని వివరించారు. అప్పటికి తప్పుని ఒప్పుకోని సుమ .. నేను సోషల్లో వీక్ అంటూ నవ్వేసింది. ఆస్ట్రానమీ, సోషల్ కి ఉన్న తేడా తెలియని సుమ ఎంత వరకు చదువుకుందోనని అదే ప్రశ్నను ఆమెను అడిగారు. అప్పుడు మేల్కొన్న సుమ.. వెంటనే ఆ టాపిక్  ని డైవర్ట్ చేసి వెరే ప్రశ్నలోకి వెళ్లింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సుమ కి ఇప్పటికైనా అర్థమయి ఉంటుంది.

Related

  1. ఆ సినిమాలో దెయ్యాలు కూడా పవన్ ఫ్యాన్స్!
  2. చెర్రీ ఊహించని షాక్ ఇచ్చిన పవన్!
  3. ఈ సంగతి తెలిస్తే పవన్ కు ఫ్యాన్ అయిపోవాల్సిందే!
  4. పవన్ కళ్యాణ్ కి నటన నేర్పినందుకు అంతా ఇచ్చారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -