Saturday, May 4, 2024
- Advertisement -

పవన్ తన కొడుకుకి ఏం పేరు పెట్టాడో తెలుసా..?

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాలుగోసారి తండ్రి అయిన విషయం తెలిసిందే. ఈ వార్త తెలియగానే పవన్ ఆనందంతో ఖుషి అయ్యారు. పవన్ మూడో భార్య లెజ్ నోవా మంగ‌ళ‌వారం పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఆ బాబును పట్టుకొని పవన్ ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

అలానే పవన్ కళ్యాణ్ అభిమానుల దగ్గర నుంచి.. సినీ ప్రముఖుల నుంచి పవన కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అయితే మంగ‌ళ‌వారం ఈ ఫోటో వైరల్‌గా మారితే బుధ‌వారం ఉదయం నుండి ఈ బాబుకి పవన్ కళ్యాణ్ ఏ పేరు పెడతాడనే చర్చ స్టార్ట్ అయింది. ఇక తన భార్య క్రిష్టియన్ కావడంతో ఈ బాబుకు కూడా క్రిష్టియన్ పేరు పెడతారని తెలుస్తోంది.

ఇప్పటికే వున్న ఆడబిడ్డకు అలాంటి పేరే వుంది. మరి దాన్ని బట్టే ఈ గాసిప్ పుట్టిందని కొంతమంది అంటున్నారు. గతం లో చాల వేదికల పై పవన్ నాకు కులమతాలు లేవు. నా భార్య క్రిస్టియన్..అని ఆయన చాలా సార్లు అన్నారు. ఈ క్రమంలో పవన్ తన నాల్గో బిడ్డకు ఏ పేరు పెడతాడో అని అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -