- Advertisement -
ఇప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కడ చూసినా ఒక ఫోటో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ తనకి రాఖీ కట్టిన అమ్మాయిల అందరు అంటే తన చెల్లెళ్ళ ఫోటులు షేర్ చేస్తూ అందులో ఒక ఫారెన్ వనిత ఆమె కూతురు ఉన్న ఫోటో ని ఇంటర్నెట్ లో పెట్టాడు.
రాఖీ పండగ పూర్తయిన్ రెండు రోజుల తరవాత చరణ్ పెట్టిన ఈ ఫోటో లో శ్రీజ , నిహారిక , సుస్మిత తో చాలా మంది ఉన్నారు. అయితే ఈ చిన్న పిల్ల మాత్రం చరణ్ ఫాన్స్ తో సామాన్య ప్రేక్షకులని ఎక్కువగా ఆకట్టుకుంది. పైగా చరణ్ ఏకంగా ఫేస్ బుక్ లో ఫోటోనే పోస్టు చేశాడంటే.. ఖచ్చితంగా పవన్ కూతురు కాకపోతే ఇంకెవ్వరు అవుతారు అనే క్లారిటీ మనకు వచ్చేస్తుంది కూడా. ఏదేమైనా కూడా.. మొన్న 61వ బర్త్ డే బ్యాచ్ లో పవన్ భార్య అన్నా లెజినోవా వచ్చిందని.. ఇప్పుడు పవన్ చిన్న కూతురు చరణ్ కు రాఖీ కట్టిందని.. ఎటు చూసినా కూడా అంతా పవన్ ఫ్యామిలీ గురించి టాక్ వినిపిస్తోందబ్బా!!
Related