Thursday, May 2, 2024
- Advertisement -

స్టేజీ మీద చరణ్ కి షాక్ ఇచ్చిన బన్నీ!

- Advertisement -

హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో మెగాస్టార్‌ చిరంజీవి 61వ జన్మదిన వేడుక అభిమానులు మధ్యలో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో మెగా హీరోలు, చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్‌లు సందడి చేయగా నాగబాబు, అల్లు అరవింద్‌లు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుక అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేయగా ఆడిటోరియం అభిమానుల అల్లర్లతో దద్దరిల్లింది. అయితే ఈ వేడుకకు మాత్రం చిరు కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు.

ముఖ్యంగా చిరు పుట్టిన రోజు వేడుక కోసం గత పది రోజుల నుండి అభిమానులు చేస్తోన్న హంగామా తననెంతో ఆశ్చర్యపరచిందని రామ్ చరణ్ తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున చిరంజీవి పుట్టిన రోజు జరగడానికి కారణమైన అభిమానులందరికి ప్రత్యేక కృతజ్ఞతలు అని రామ్ చరణ్ తెలిపారు. ఇంకా చరణ్ మాట్లాడుతూ.. నాన్నగారికి అందరు ఒక్కసారి బర్తుడే విషేస్ చెప్పండి అని అనడంతో అక్కడ ఉన్న అభిమానులందరూ మెగాస్టార్.. మెగాస్టార్ అని తమ అనందాన్ని వ్యక్తం చేశారు.

వేంటనే బన్నీ స్టేజీ మీదకు వచ్చి మెగాస్టార్ అని ఎందుకు అరుస్తున్నారు.. ఇక్కడ ఉన్నాదే మెగాస్టార్ అని చెప్పాడు. దాంతో చెర్రీ మనకు అంతలేదులే అని నవ్వేశాడు. ఇక ఈ వేడుకలో వివి వినాయక్, సురేందర్ రెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ కూడా పాల్గొన్నారు. చిరంజీవి ఫస్ట్ లుక్‌ని చూసి ఫుల్ ఇంప్రెస్ అయిన ఫ్యాన్స్ సంక్రాంతి కానుకగా రానున్న ఖైదీ నెంబర్ 150పై భారీ అంచనాలే పెట్టుకున్నారు.

{youtube}v=PMQ-txvmlyY{/youtube}

{youtube}v=eXfiwBmTLSE{/youtube}

Related

  1. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  2. బన్నీ బిజినెస్ మొదలు పెట్టబోతున్నాడు!
  3. అల్లు అర్జున్ కి ఎలాంటి బిరుదు ఇచ్చారో తెలుసా?
  4. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -