పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వీరాభిమానిని దారుణంగా చంపేసారు మరో హీరో అభిమాని. కర్ణాటక లోని కోలార్ లో ప్రాంతంలో ఈ దారుణ సంఘటన జరిగింది. అయితే చనిపోయిన అభిమాని తిరుపతి కి చెందిన వినోద్ రాయల్.
వినోద్ తిరుపతిలో పవన్ అభిమానిగా, అలాగే జనసేన పార్టికి కార్యకర్తగా ఉండేవాడు. అయితే తన మిత్రుడితో కలిసి కర్ణాటక లోని కోలార్ లో జరిగిన ఓ హీరో వేడుక కు వెళ్ళారు.
సదరు హీరోని పొగడ్తలతో ముంచెత్తుతుండగా స్నేహితుల మద్య జరిగిన చిన్న గొడవ చిలికి చిలికి గాలి వానలా మారడంతో ఎదరు తిరిగిన పవన్ అభిమాని వినోద్ ని కత్తితో పొడిచాడు. దాంతో వినోద్ ని కారులో ఆసుపత్రి కి తరలిస్తున్న సమయంలో మధ్యలోనే వినోద్ చనిపోయాడు. చనిపోయిన వినోద్ కోలార్ నుంచి తిరుపతి కి తరలించడం తో పెద్ద ఎత్తున పవన్ అభిమానులు తరలి వచ్చారు.
Related
