Thursday, May 16, 2024
- Advertisement -

పవన్ మనసు ఎంతమంచిదో తెలుసా?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏ రెంజ్ లో ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. పవన్ కళ్యాణ్ ఎవరికైన మాట ఇస్తే.. ఆ మాట మీద నిలబడేందుకు ఎంత కష్టం అయిన పడుతాడు. రీసెంట్ గా జరిగిన ఓ సంఘటన తో మరోసారి పవన్ మంచితనం ఎలాంటిదో అర్ధం అవుతోంది. ఇటివలే పవన్ డబ్బుల్లేక తన దగ్గర ఉన్న మెర్సిడస్ బెంజ్ కార్ అమ్ముకున్నాడని కొన్ని రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే. కానీ దీని వెనక మంచి నిజం ఉందని ఫిలిం నగర్ వాసులు అంటున్నారు.

తన దగ్గర డబ్బులు లేక కారు అమ్మలేదని వెల్లడించారు. గతంలో పవన్ కళ్యాణ్ చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు అయ్యే ఖర్చు భరిస్తానని మాట ఇచ్చాడట. వారి ఆపరేషన్లకు టైం దగ్గర పడింది. అప్పుడు ఒకేసారి అంతమొత్తంలో డబ్బులు లేకపోవడంతో, ఎవరిని దగ్గర తీసుకోవడం ఇష్టంలేక తన సొంత కారుని అమ్మేసి.. వచ్చిన 70 లక్షలు చిన్న పిల్లల గుండె ఆపరేషన్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇలా పవర్ స్టార్ తన సొంత డబ్బులతో ఎంతో మంది చిన్న పిల్లల ప్రాణాలు కాపాడారు. సినిమాలోనే కాకుండా నిజజీవితంలో కూడా పవర్ స్టార్ హీరో అనిపించుకున్నారు. ఈ విషయం పవన్ బయటకు చెప్పలేదు. తనపై కొన్ని నెగిటివ్ వార్తలు వచ్చిన పెద్దగా పట్టించుకోలేదు. సాయం పొందిన వారు కారు అమ్మిన సంగతి వెనుక ఉన్న విషయం తెలుసుకున్న వారందరు పవన్ పై మరింత అభిమానం పెంచుకున్నారు. ఒక మంచి పని చేయడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, ఎవరికీ సంజాయిషీ చెప్పుకోనక్కరలేదని ఈ సంఘటన ద్వారా పవర్ స్టార్ నిరూపించారు.

Related

  1. పవన్ కొడుకు ఆ సినిమాలో గెస్ట్ రోల్ పోషించాడు!
  2. విజయ్ కి బంపర్ ఆఫర్ ఇచ్చిన పవన్!
  3. ” పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది “
  4. పవన్ కళ్యాణ్ కడప కింగ్ స్టోరీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -