Monday, May 13, 2024
- Advertisement -

మీ ప్రేమను తెలుపబోయే ప్రణాళిక!

- Advertisement -

మీ ప్రేమను మీరు ప్రేమించిన అమ్మాయికి తెలపాలి అనుకుంటున్నారా? ఆమెను ఆకర్షించాలి అనుకుంటున్నారా? మాములు గా అబ్బాయిలు ఇలాంటి విషయల్లో ప్రయత్నించి విఫలం అవుతుంటారు. ఇలాంటి చింతనల గురించి ఆలోచించకండి. మీ ప్రేమను తెలుపబోయే విధానం ఇద్దరి జీవితాంతం గుర్తుండిపోయేలా ప్రణాళికను తయారు చేసుకోండి, ఎందుకంటే ప్రేమ వ్యక్తీకరణ విధానం మీ ప్రియురాలికి నచ్చాలి.ఇలాంటి సంఘటనలు జీవితంలో ఒక్కసారి మాత్రమె వస్తాయి.

* ప్రేమ వ్యక్తీకరణ కోసం చాలా మార్గాలు అందుబాటులో ఉన్నాయి, కానీ ప్రేమ లేదా పెళ్లి వంటి భావోద్వేగాలకు సంబంధించిన వ్యక్తీకరణలను చాలా జాగ్రత్తగా చేయాలి. వీటికి సంబంధించిన వ్యక్తీకరణ మీ హృదయం నుండి రావాలి.

* ప్రేమను తెలుపటానికి రొమాంటిక్ వాతావరణాన్ని ఏర్పరచాలి అనగా ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో సాయంత్ర సమయంలో మరియు చిన్న కొవ్వొత్తి వెలుగులో, భోజనం చేస్తూ మంచి మెలోడి పాట నడుస్తున్నపుడు మీ ప్రేమను, ఉద్దేశ్యాలను తెలిపినట్లయితే ఆమె తప్పకుండా ఒప్పుకుంటుంది. ఇలాంటి వాతావరణాలలో మగువలు చాలా ప్రశాంతంగా భావిస్తుంటారు.

* ఇలాంటి సందర్భాలు మాత్రేమే కాకుండా, ప్రత్యేక సందర్భాలలో అనగా ఇంట్లో జరిగే కుటుంబ ఫంక్షన్’లలో మీ అభిప్రాయాలను అందరి ముందు తెలియబరచండి.

* ఆకస్మిక ప్రయాణాలు, సెలవులు మీ మధ్య సంబంధాన్ని గట్టి పరుస్తాయి. ఇలాంటి సందర్భాలలో ఆకస్మికంగా మోకాళ్ళ పైన నిల్చొని ఎంగేజ్మెంట్ రింగ్’ను తీసి “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని అడగండి.

* మీ భావ వ్యక్తికరణను ఆమెకి ఇష్టం అయిన చోట (రెస్టారెంట్) వంటి వాటిలో ముందుగానే ప్లాన్ చేసి ఆమెను ఆహ్వానించి మీ ప్రేమను తెలియచేయండి.

* ప్రేమను తెలపటం కోసం ప్లాన్ చేసే సందర్భాలను చాలా జాగ్రత్తగా జరపండి ఎందుకనగా ఇవి మీ మానసిక మరియు మీ జీవితానికి సంబంధించినవిగా చెప్పవచ్చు. ఇలాంటి వాటిలో అవగాహన లేకుంటే జోక్యం చేసుకోకండి.

* ప్రియురాలికి ప్రేమను తెలిపే సందర్భాలలో మీరు భయాందోలనలకు గురవటం సాధారణం. మీ ఆలోచనల గురించి మీ దగ్గరి స్నేహితులతో చర్చించి అందులో ఉన్న తప్పిదాలను సవరించుకోండి.

* ప్రేమను తెలిపే సమయంలో మంచి దుస్తువులను సూట్’ను ధరించండి. ఆమెను ఆకర్షించే విధంగా మంచి డ్రెస్, షూలను ధరించి ఆమె ముందు నిలబడండి.

మీరు రూపొందించిన ప్రణాళికలను అనుసరుంచండి ఏ మాత్రం తప్పిదాలు జరగకుండా జాగ్రత్త పడుతూ, ఉద్రిక్తతలకు లోనవకండి. ప్రేమను వ్యక్తపరిచేటపుడు, ఒక మోకాలి పైన నిలబడి తెలపండి.

* ప్రేమను తెలిపే సమయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ, ప్రశాంతంగా ఉండండి. మీ హృదయం సూచించిన విధంగా నడుచుకుంటూ, ప్రణాలికలను నడిపిస్తూ, మీ ప్రేమను వ్యక్తపరచండి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -