Saturday, May 18, 2024
- Advertisement -

అక్కడికి.. ఆ ఇద్దరే వెళ్లలేదట

- Advertisement -

బెంగళూరులోని ఫామ్ హౌజ్ లో హడావిడి, హంగామా మధ్య.. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి ఘనంగా జరిగింది. తర్వాత.. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో అంతకంటే కాస్త ఎక్కువ హంగామాతో రిసెప్షన్ కూడా జరిగింది. పెళ్లి అయితే.. పర్సనల్ గా చేసేశారు కాబట్టి.. ఎక్కువగా వివరాలు బయటికి రాలేదు.. కానీ.. రిసెప్షన్ బాగా ఆడంబరంగా చేశారు కదా.. అందుకే కొన్ని లోపాలు బయటపడుతున్నాయి.

ఈ వేడుకకు.. చిరంజీవి ఫ్యామిలీ.. తెలుగు రాష్ట్రాల్లోని చాలా మంది ప్రముఖులను ఆహ్వానించింది. అందులో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను చిరు స్వయంగా ఇన్వైట్ చేశారట. అలాగే.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ ఆహ్వానం పంపారట. ఇలా చాలా మంది ఇన్విటేషన్ అందుకున్న వాళ్లంతా.. రిసెప్షన్ వేడుకకు వెళ్లి.. దంపతులను ఆశీర్వదించారు. 

కానీ.. తమ్ముడు పవన్, ప్రతిపక్ష నేత జగన్. ఇద్దరూ శ్రీజ రిసెప్షన్ కు వెళ్లలేదట. సర్దార్ రిలీజ్ టెన్షన్ లో పవన్.. వ్యక్తిగత కారణాలతో జగన్.. ఇద్దరూ ఈ ఈవెంట్ కు దూరంగా ఉన్నారట. అదీ మ్యాటర్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -