Thursday, May 16, 2024
- Advertisement -

సర్దార్ ఖచ్చితంగా హిట్. ఎందుకంటే?

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కోసం పవన్ అభిమానులే కాక సినీ పరిశ్రమ కూడా ఎదురు చూస్తుంది. అత్తారింటికి దారేదు సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది. మధ్యలో గోపాల గోపాల రిలీజ్ అయినా అందులో ప్రధాన పాత్ర మాత్రమే పోషించారు పవన్. అందుకే కాబోలు పవన్ మూవీ కోసం అభిమానులు ఇంతగా ఎదురు చూస్తున్నారు.

ఐతే పవన్ కూడా రెస్ట్‌ లేకుండా సర్దార్ షూటింగ్‍లో పాల్గొంటున్నాడు. బాబీ దర్శకత్వంలో తెరకేక్కుతున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఐతే ఈ రోజు కాజల్ తన అధికరిక ఫేస్ బుక్‍లో సర్దార్ సెట్ లో పవన్‍తో దిగిన ఈ ఫోటోని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో హల చల చేస్తుంది. ఐతే ఈ సినిమాని ఏప్రిల్ 8న విడుదల చేయాలని ఈరోస్ ఇంటర్నేషనల్ ప్రకటించేసింది.

షూటింగ్‍ కూడా పూర్తి కాకుండా అప్పుడే రిలీజ్ డేట్ చేప్పేశారు. ఈ సమ్మర్‍కి ”బ్రహ్మోత్సవం” వస్తుందనుకున్నారు కానీ ఈ సినిమా ఇప్పుడు పోస్ట్ పోన్ అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎలాగైన తన సినిమాని సమ్మర్‍కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాడు పవన్. ఈ సమ్మర్‍లో మరో సారి పవన్ తన సినిమాతో రికార్డ్‌లు సృష్టించనున్నాడు అంటున్నారు సినీ విశ్లేషకులు. అందులోను పవన్‍కి సమ్మర్ చాల కలిసి వస్తుంది. సమ్మర్‍లో రిలీజ్ అయిన పవన్ ప్రతి సినిమా సూపర్ హిటే. అలాగే సర్దార్ కూడా సూపర్ హిట్ అంటున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -