Saturday, May 25, 2024
- Advertisement -

జిహెచ్ ఎంసి కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి

- Advertisement -

పురానాపూల్ రీ పోలింగ్ నైపథ్యంలో అధికారులు  కౌంటింగ్ ను సాయంత్రంప్రారంభిస్తారు. రాత్రి 10 గంటల కల్లా పూర్తి ఫలితాలు వెలువడుతాయి.  సాయంత్రం 5గంటల నుంచి తెరిచి అధికారులు కౌటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. రాత్రి 10 గంటల కల్లా ఫలితాలు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించిన అనంతరం ఈవిఎం ఓట్లను లెక్కించనున్నారు. ఈ కౌంటింగ్ కు 5వేల 626 మంది సిబ్బంది పని చేయనున్నారు. జిహెచ్ ఎంసి ఎన్నికల ఫలాతాల కౌంటింగ్ ప్రక్రియ జంట నగరాలలో 24 కేంద్రాలలో జరగనుంది. మొత్తం 18 సర్కిళ్ల పరిధిలోని పలు కాలేజీలు, యూనివర్సిటి కాలేజీలలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. వీటిలో జేఎన్ టి యు, నిజాం కాలేజ్ , కోట్ల విజయభాస్కరెడ్డి స్టేడియం, ఉస్మానియా యూనివర్సిటి , గచ్చిబౌలి స్టేడియంలతో పాటు మిగతా ప్రాంతాలలో  కౌంటింగ్ జరగనుంది. 

ఫలితాల ముగిసిన అనంతరం పోలీసు అధికారులు పలు నిబంధనలు విధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద బాణా సంచ కాల్చవద్దని…అదే విధంగా విజయోత్సవ ర్యాలీలు చేపట్టకూడదని హైదరాబాద్ పోలీసు కమిషర్ మహేందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే గెలిచిన అభ్యర్ధులు వీటిని ఫాలో అవుతారా లేదా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -