ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకేక్కుతున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నాడు. ఐతే మెగా హీరోలందరు మెగాస్టార్ పాటలను రీమిక్స్ చేసి వాడేసుకుంటున్నారు.
కానీ పవర్ స్టార్ ఒక్కడే మెగాస్టార్ పాటలను వాడలేదు. అయితే పవన్ కూడా చిరు పాటను సర్దార్ సినిమాలో వాడుకోబుతున్నాడట. ‘నా కోక బాగుందా.. నా రైక బాగుందా’.. అంటూ రాధ అడిగితే.. ‘నీ కోక నచ్చింది.. నీ రైక నచ్చింది’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పి కలిసి డ్యాన్స్ చేసిన పాటను ఇప్పుడు సర్దార్ లో ఐటెం సాంగ్ గా ఉపయోగించుకోనున్నారు.
ఈ పాటలో పవర్ స్టార్ పక్కన రాయ్ లక్ష్మీ డ్యాన్సులు చేయనుండగా.. నా కోక బాగుందా సాంగ్ రీమిక్స్ పనులను ఇప్పటికే పూర్తి చేసేశాడు దేవి శ్రీ ప్రసాద్. ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. సర్దార్ ఆడియో వేడుకకు చిరు రాబోతున్నారట. ఈ సినిమాని సమ్మర్‍లో రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నారు.
