Friday, May 17, 2024
- Advertisement -

మోసం చేశారు.. మళ్లీ దీక్ష చేస్తా

- Advertisement -

అనుకున్నంతా అయ్యింది. కాపుల రిజర్వేషన్లకు సంబంధించి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో మోసపోయానంటూ.. కాపు నేత ముద్రగడ పద్మనాభం సీరియస్ అయ్యారు. మాట ఇచ్చారు.. మరిచిపోయారు అంటూ.. తీవ్రంగా స్పందిస్తూ… చంద్రబాబు సర్కార్ కు మరో అల్టి మేటమ్ ఇచ్చారు. ఈ నెల 10 లోగా తన డిమాండ్లు తీర్చకుంటే.. మళ్లీ ఆమరణ దీక్ష చేస్తానంటూ.. స్పష్టం చేశారు. అలా చెప్పడమే కాదు.. తన అనుచర వర్గంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేసేసుకుంటున్నారు.

ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో ఈ మధ్య జరిగిన కాపు గర్జన సభ.. ఎంతటి ఉద్రిక్తతకు కారణమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లక్షల మందితో చేసిన ఆ దీక్షలో ఆఖరికి ఓ రైలు కూడా పూర్తిగా కాలిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా ఈ విషయం చర్చనీయాంశమైంది. కాపుల్లో ఇంత ఆగ్రహావేశాలు ఉన్నాయా అన్న విషయం కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఇంతదాకా చంద్రబాబు సర్కార్ పరిస్థితిని ఎందుకు రానిచ్చిందన్న ప్రశ్నలు కూడా ఉదయించాయి.

అయితే.. ఈ ప్రశ్నలన్నిటికీ ముద్రగడ జవాబులు చెప్పారు. తమ పని తాము చేసుకుంటున్న కాపులను.. రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబే అని తేల్చారు. రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి.. రుణాలు ఇస్తామని చెప్పి.. కాపులను మోసం చేశారన్నారు. కాపు రుణ మేళా పేరుతో.. టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్లకే రుణాలు అందేలా చేశారని విమర్శించారు. చివరికి.. న్యాయమైన డిమాండ్ల కోసం దీక్షకు దిగిన తనను కూడా.. టీడీపీ నేతలతో తిట్టించారని మండిపడ్డారు. ఇక బాబు ప్రభుత్వాన్ని వదిలేదని లేదని.. కాపులకు రిజర్వేషన్ల డిమాండ్ పై ఎంతవరకైనా వెళ్తానని ముద్రగడ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సంతకంతో హామీ పత్రం ఇస్తేనే.. తాను సైలెంట్ గా ఉంటానని కూడా తెగేసి చెబుతున్నారు.

ఈ సారి ముద్రగడ సీరియస్ నెస్ చూస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ ఇరకాటంలో పడేలాగే కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -