పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఏ రెంజ్‍లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఐతే పవన్ మాత్రం ఎప్పుడు నెంబర్ వన్ కావాలి అనుకోలేదు. ఈ విషయం స్వయంగా పవనే చాలా సందర్భల్లో చెప్పాడు. ఇప్పుడు ఉన్న క్రేజ్, ఇమేజ్ అన్ని దేవుడిచ్చాడు అని నమ్ముతాడు పవన్. అభిమానులకోసం సినిమాలు చెస్తున్నాడు అంతే తప్ప ఇమేజ్ పెంచుకోవాలి అని మాత్రం కాదు.
కానీ ఇప్పుడు పవన్ దృష్టి మారుతున్నట్లు కనిపిస్తుంది. పవన్ తర్వాత వచ్చిన హీరోలు కూడా తమ మార్కేట్‍ను పెంచుకుంటున్నారు. అందుకే ఇప్పుడు తన మార్కెట్ పరిధి కూడా పెంచుకోవాలని ఫిక్సయ్యాడు పవర్ స్టార్. అందుకే సర్దార్ సినిమాను తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదల చేయబోతున్నాడు.
ఏకంగా హిందీలో 800 స్క్రీన్స్ లో పవన్ సర్దార్ విడుదల కానుంది. తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేసారు నిర్మాతలు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండటంతో హిందీలోనూ భారీ ప్రమోషన్ ఖాయం. పైగా ఇప్పుడు పవన్ పేరు అన్ని ఇండస్ట్రీల్లోనూ మారుమోగిపోతుంది. సో పవన్ బాలీవుడ్‍లో సర్దార్ సినిమాతో ఏ రెంజ్‍లో హిట్ కొడుతాడో చూడాలి మరి.