Saturday, May 18, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ ఎవరికీ సపోర్ట్ ? బాలయ్య కా ఎన్టీఆర్ కా ?

- Advertisement -

నందమూరి వంశంలో మొదలైన ఆధిపత్య పోరులో తాజా పరిణామాలు మంచి రసవత్తరంగా మారాయన్న సంగతి తెలిసిందే. బాలయ్యేమో ఎన్.టి.ఆర్ ను లైట్ తీసుకుంటుంటే తారక్ మాత్రం అన్ని విధాలుగా బాలయ్యకు పోటీ పడేందుకు సిద్ధమయ్యాడు. మొన్నటిదాకా పరోక్షంగా ఉన్న గొడవలు డిక్టేటర్, నాన్నకు ప్రేమతోల ఆడియో వేడుకలు బహిర్గతం అయ్యేలా చేశాయి.

ఇక నందమూరి స్టామినా సీనియర్ ఎన్.టి.ఆర్ తర్వాత తన వల్లే పెరిగిందనే బాలయ్య ఓ పక్క చెబుతుంటే మరొపక్క ఎన్.టి.ఆర్ మాత్రమే సీనియర్ ఎన్.టి.ఆర్ వారసుడు అంటూ హరికృష్ణ అనడం ఫ్యాన్స్ లో కూడా పెద్ద చిచ్చు రేపింది. నందమూరి అభిమానులే రెండు వర్గాలుగా ఏర్పడటం జరిగింది.

ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరిద్దరిలో ఎవరికైనా సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇచ్చే అవకాశం ఉందని నెటిజెన్లు ఇంట్రెస్టింగ్ పోలింగ్ పెడుతున్నారు.ఓ పక్క బాలయ్యకే పవర్ స్టార్ సపోర్ట్ అంటుంటే మరో పక్క మాత్రం యంగ్ టైగర్ కే తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఇక మొదటిసారి సినిమాల పరంగా గొడవ పడుతున్న బాబాయ్, అబ్బాయ్ ల్లో ఎవరు నెగ్గుతారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -