Monday, April 29, 2024
- Advertisement -

ఇదెక్కడి వింత .. ఆరెస్సెస్ లో క్రైస్తవ విభాగం !

- Advertisement -

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) త్వరలో క్రిష్టియన్ విభాగాన్ని ప్రారంభించబోతోంది. సంఘ్ లో ఇతర మతాల విభాగాలు ఉన్నా, క్రిష్టియన్ వర్గం కోసం పనిచేయడానికి ఇప్పటి వరకు ప్రత్యేక విభాగం లేదు. ఈ నేపథ్యంలో క్రిష్టియన్స్ కోసం సంఘ్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

ఇందుకు సంబందిచి గత డిసెంబర్ 17న వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు క్రిష్టియన్ మత పెద్దలతో సమావేశాన్ని కూడా నిర్వహించారు. దశాబ్దం క్రితమే ముస్లింల కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసిన ఆరెస్సెస్..క్రిష్టియన్ కమ్యూనిటితో సత్సంబంధాలు పెంచుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్రీయ ఇసాయి మంచ్ (ఆర్ఐఎం)అనే పేరుతో ఈ విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం.

ఆర్ఐఎం ఏర్పాటుకు సంబంధించిన అన్ని వివరాలను ఆరెస్సెస్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు ఇంద్రేష్ కుమార్ తెలిపారు. క్రైస్తవుల కోసం, క్రైస్తవుల చేత, క్రైస్తవుల వల్ల ఈ ఆర్ఐఎం ఏర్పాటు అవుతుందని అయన తెలిపారు. ఇటీవల దేశంలో అసహనం పెరిగిపోయిందని ఓ వర్గం నుండి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలకు సాంత్వన కలిగించే చర్యల్లో ఆర్ఐఎం ఏర్పాటు కీలకం కానుంది. అలాగే క్రిస్టియన్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ కేవలం హిందూ సంస్థ మాత్రమే కాదని చాటి చెప్పేందుకు సంఘ్ పెద్దలు చర్చలు మొదలు పెట్టారు. అయితే వీలయినంత తొందరగా  క్రిష్టియన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న సంఘ్ నేతలు ఈ ఏడాది క్రిస్మస్ నాటికీ ఈ విభాగం ఏర్పాటు చేయడం ఖాయమని సంకేతాలు ఇస్తోంది.

మన దేశంలో చురుకుగా పనిచేస్తున ఆర్ఎస్ఎస్ ఇటీవల కాలంలో విదేశాల్లో విస్తరించాలని చూస్తోంది. హిందూ స్వయం సేవక్ సంఘ్ పేరుతో విదేశాల్లో ఆరెస్సెస్ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇనాళ్లు సంఘ్ లో లేని క్రిష్టియన్ విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దం అయింది. కాగా, ప్రస్తుతం హిందూ స్వయంసేవక్ సంఘ్ 39 దేశాల్లో పనిచేస్తోంది. ఐదు పశ్చిమ ఆసియా దేశాల్లో సంఘ్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -