Monday, May 6, 2024
- Advertisement -

పవన్ కళ్యాణ్ మరోసారి తండ్రి కాబోతున్నాడు..?

- Advertisement -

ఈ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఇది ఆయనకు 45వ పుట్టిన రోజు కాగా.. ఈ సందర్భంగా ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పవన్ కళ్యాణ్ త్వరలోనే మరోసారి తండ్రి కాబోతున్నాడట. పవన్ భార్య అనా లెజ్‍నెవా రెండో బిడ్డకు జననివ్వబోతున్నట్లు సమాచారం.

లెజ్‌నెవా ప్రస్తుతం ఎనిమిది నెలల గర్భవతి అట. ఆమె అక్టోబరు మధ్యలో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు చెబుతున్నారు. ఇక పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింహ్ విదేశాలలో జరగనుంది. బిడ్డను ప్రసవించే సమయంలో పవన్ భార్య వెంటే ఉంటాడట. పవన్ కు ఇది నాలుగో సంతానం కావడం విశేషం. పవన్ ఇప్పటికే ముగ్గురు బిడ్డలకు తండ్రి. తన మాజీ భార్య రేణు దేశాయ్‌తో అతడికి ఇద్దరు పిల్లలున్న విషయం తెలిసిందే. వాళ్లే.. అకిరా నందన్, ఆద్య. లెజ్‌నెవా‌ కూడా పవన్‌తో పెళ్లయ్యాక ఓ అమ్మాయికి జన్మనిచ్చింది.

పవన్ కు ఈమె మూడో భార్య అన్న విషయం తెలిసిందే. ‘తీన్ మార్’ మూవీలో ఓ ప్రత్యేక పాత్ర పోషించిన లెజ్‌నెవాతో ఆ సినిమా షూటింగ్‌లో ప్రేమలో పడ్డాడు పవన్. అప్పటికే పవన్.. రేణు నుంచి విడిపోయి ఉన్నాడు. కొన్నెళ్ల ప్రేమాయణం తర్వాత లెజ్‌నెవాను పవన్ పెళ్లి చేసుకున్నాడు. లెజ్‌నెవా మెగా ఫ్యామిలీ వేడుకలకు అప్పుడప్పుడూ హాజరవుతూ ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -