Wednesday, May 22, 2024
- Advertisement -

రాష్ట్రంలో శాశ్వ‌త అధికారం మాదే…. బాబు దురాశ‌..

- Advertisement -

కాకినాడ‌, నంద్యాల ఎన్నిక‌ల్లో టీడీపీ గెలిచిన త‌ర్వా బాబులో అంతులేని విశ్వాసం ఏర్ప‌డింది. ఇక ఏపీలో త‌మ‌దే శాశ్వ‌త అధికారం అంటూ పెద్ద మాట అనేశాడు. 2004 ఎన్నిక‌ల్లో విజ‌యం మాదె అంటూ బాబు విశ్వాసం వ్య‌క్తం చేసెవాడు. తిరిగి చూస్తె ప‌దిసంవ‌త్సరాలు ప్ర‌తిప‌క్షంలో కూర్చొబెట్టారు ప్ర‌జ‌లు. కాని ఇప్పుడు అదే ప‌ల్ల‌వి అందుకుంటున్నాడు.

పశ్చిమబెంగాల్ కు సీఎంగా జ్యోతిబసు 23సంవత్సరాల పాటు పని చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ రికార్డును 2004లో బాబు బ‌ద్ద‌లు కొడతార‌ని అప్ప‌ట్లో తెలుగు త‌మ్ముళ్లు చెప్పేవాళ్ళు. దీన‌ర్థం పాతికేళ్ల‌పాటు బాబు ఏపీకి సీఎంగా ఉంటారంట‌. త‌ర్వాత ఏంజ‌రిగిందో అంద‌రికి తెలిసిందే. త‌ర్వాత ఎట్ట‌కేల‌కు మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చారు. నంద్యాల‌, కాకినాడ ఎన్నిక‌లలో నానా అడ్డ‌దారులు తొక్కి గెలిచారు.

కాని ఇప్పుడు అధికారంపై పెద్ద పెద్ద మాట‌లు మాట్లాడుతున్నారు. ఈ సారి జ్యోతిబ‌సు రికార్డు ఏమో గాని 2014 లోనె సీఎంగా కాదు శాశ్వ‌తంగా అధికారంలో ఉంటామంటూ మిలీనియం జోక్ వేశారు. బాబు అన్న‌ది బాగానె ఉంది. శాశ్వతంగా టీడీపీనే అధికారంలో ఉంటే ముఖ్యమంత్రి ఎవరు? ఎలాగూ శాశ్వాతంగా అంటున్నారు కాబట్టి.. అది బాబుగారికి సాధ్యమే అనుకున్నా, శాశ్వతంగా ఉండటం మానవమాత్రుడికి సాధ్యం కాదు. పుట్టిన వాడు మ‌ర‌ణించ‌క త‌ప్ప‌దు.

బాబు త‌ర్వాత సీఎం లు ఎవ‌రంటె నేతలు కొంత వ‌ర‌కు క్లారిటీ ఇచ్చారు. బాబు త‌ర్వాత సీఎం లోకేష్‌….
ఆయ‌న కూడా ‘శాశ్వతంగా’ ఉండలేడు కదా.. అందుకే, దేవాన్ష్ ను కూడా కాబోయే నేత అంటుంటారు కొంతమంది టీడీపీ లీడర్లు. ఎలాగూ శాశ్వ‌తం అన్నాడు కాబ‌ట్టి దేవాన్ష్ తర్వాత దేవాన్ష్ కొడుకో, కూతురో సీఎం అవుతారు. ఇది చంద్ర‌బాబు లెక్క‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -