Friday, May 17, 2024
- Advertisement -

పవన్ ఫ్యాక్షన్ తో కామెడీ చేయబోతున్నాడా?

- Advertisement -

పవన్ కామిడీ చేస్తే అభిమానులు పండగ చేసుకుంటారు. అయితే ఫ్యాక్షన్ కు కామిడీ జోడి చేస్తూ చాలా సినిమాలే వచ్చాయి. ఇలాటి జోనర్లోనే అల్లరి నరేష్ ఫ్యాక్షనిస్టుగా చేస్తూ కామిడీ కూడా పండించాడు. ఇంకొన్ని కామెడీ ఫ్యాక్షన్ చిత్రాల్లో కూడా నటించాడు. టాలీవుడ్ లో ఫ్యాక్షన్ తో మిక్స్ చేసి కామిడీని పండిస్తున్నారు. ఇలాంటి టైంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ పవన్ చేస్తున్నాడు.

ముందు అందరు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ పవన్ సినిమా చేయడం ఏంటీ అనుకున్నారు. కానీ పవన్, దర్శకుడు ఎస్ జే సూర్య కలిసి ఫ్యాక్షన్ కి కామిడీ కూడా జోడించి ఇప్పటికే స్క్రీన్ ప్లే కంప్లీట్ చేశారట. తాజా ఈ చిత్రాన్నికి కడప కింగ్ టైటిల్ కూడా పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ చిత్రం హార్డ్ కోర్ ఫ్యాక్షన్ సినిమానా… లేక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న కామెడీ సినిమానా అనే డౌట్ లో పడిపోయారు.

ఆ డౌట్ ఎందుకు వచ్చిందంటే గతంలో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరిలో సినిమాలో ఓ డైలాగ్ ఉంది. ఈ కాలంలో గాంధీపై సినిమా చేస్తే ఎవడూ చూడడు.. అదే కడప కింగ్ అనే టైటిల్ పెట్టి సినిమా తీస్తే హండ్రెడ్ డేస్ పక్కా అని ఓ డైలాగ్ చెబుతాడు సయాజీ షిండే. ఈ డైలాగ్ కామెడీ యాంగిల్ లో సాగింది. అలా పాపులర్ అయిన ఈ డైలాగ్ నుంచి కడప కింగ్ అనే పేరును తీసి, పవన్ సినిమాకు పెట్టారంటే…అది కామెడీ సినిమానేమో అనే అనుమానం అందరికీ కలుగుతుంది. మరి అసలు విషయం తెలియాలి అంటే పవన్ ఓ క్లారిటీ ఇచ్చేంతవరకు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -