Friday, May 17, 2024
- Advertisement -

బాబుకు అంత అవసరం ఏమొచ్చింది?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కోర్టుల చట్టం విషయంపై.. రోజుకో రకంగా వార్త పుట్టుకొస్తోంది. అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా హక్కులు కల్పించే ఈ చట్టం వెనక.. దురుద్దేశం ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. గతంలో పదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు..

ఇప్పుడు ఉన్నఫళంగా ఇలాంటి చట్టాన్ని ఎందుకు అమల్లోకి తెచ్చారన్నదే అనుమానాలకు కారణమవుతోంది. ప్రత్యర్థి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టి.. తనకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థే లేకుండా చేయాలన్నదే బాబు వ్యూహంగా కొందరు అనుమానిస్తున్నారు. 

రాష్ట్రపతి ఆమోదంతో.. ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక కోర్టుల చట్టం అమల్లోకి వచ్చిదంటూ.. బాబు సర్కార్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. అయితే.. ఈ చట్టం మెయిన్ ఉద్దేశం ఇందాక చెప్పుకున్నట్టు.. అవినీతిపరుల ఆస్తులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడమే. అంటే.. ఆంధ్రా అధికారపార్టీ లెక్కల ప్రకారం.. టీడీపీలో ఎవరూ అవినీతిపరులు లేరు. ఆఖరికి చీటింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి వర్యులు సుజనారెడ్డికి.. మళ్లీ రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టడం ద్వారా ఆయన నిఖార్సైన.. నిజాయితీతో కూడిన రాజకీయ నాయకుడని టీడీపీ చెప్పకనే చెప్పింది. 

సో.. టీడీపీలో ఇంకెవరూ అవినీతిపరులు లేరంటే.. ప్రతిపక్ష వైసీపీలో ఉన్నట్టే లెక్క. అందునా.. లక్ష కోట్ల అవినీతి ఆరోపణలు.. అక్రమ ఆస్తుల ఆరోపణలతో కేసులు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత జగనే.. టీడీపీ ఉద్దేశంలో మొదటి అవినీతి పరుడు అయి ఉండవచ్చు అన్నది.. కొందరి వాదన. జగన్ ఆస్తులను.. ముఖ్యంగా సాక్షి మీడియాను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంటుంది అని.. ఈ మధ్య కొందరు ప్రభుత్వ పెద్దలు పదే పదే కామెంట్లు చేస్తుండడం కూడా.. ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. అంటే.. ఏ వైపు చూసినా.. జగన్ ను టార్గెట్ చేసేందుకే.. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కోర్టుల చట్టాన్ని బాబు ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్న వాదన ఊపందుకుంటోంది. 

ఈ విషయంలో వాస్తవం ఎంతో.. అబద్ధం ఎంతో… చట్టాన్ని తయారు చేసిన పాలకులకే ఎరుక!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -