Saturday, May 18, 2024
- Advertisement -

సెకెండ్ ఇన్నీంగ్స్‌ని మొద‌లు పెట్ట‌నున్న రేణుదేశాయ్ …

- Advertisement -

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో విడిపోయిన త‌ర్వాత రేణూదేశాయ్ ఏం మాట్లాడినా వివాదాస్ప‌దంగా మారుతున్న సంగ‌తి తెలిసిందే. వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను మీడియాతో, సోషియ‌ల్ మీడియా ద్వారా ఏది షేర్ చేసుకున్నా ప‌వ‌న్ ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించిన తీరును చూశాం. ప్ర‌స్తుతం రేణుదేశాయ్ కెరీర్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

తనపై అభ్యంతరకంగా కామెంట్స్ చేసిన పవన్ ఫ్యాన్స్ కు గానీ, ఇతరులకు గానీ బుద్ధి చెప్పడానికైనా ఖచ్చితంగా మరో వివాహం చేసుకుని, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆనందం పొందే యోచనలో రేణుదేశాయ్ ఉన్నట్లుంది. అందుకె సెకెండ్ ఇన్నింగ్స్ రెడీ అవుతోంది. ఇప్పుడిప్పుడే యాక్టింగ్‌పై దృష్టిపెడుతోంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించాలని ట్రయల్స్ వేస్తున్నది.

బుల్లితెరపై చేసిన నీతోనే డ్యాన్స్ షో ప్రయోగం కొంత బెడిసి కొట్టింది అనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బిగ్ స్క్రీన్‌పై అవకాశాలను రేణుదేశాయ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. తెలుగులో అవ‌కాశాలు ఉన్నా ప‌వ‌న్ అభిమానులు ఎలా స్పందిస్తారోన‌న్నది అమెకు అడ్డంకిగా మారింది. అందుకె మ‌ళ‌యాలంమీద దృష్టి పెట్టిన‌ట్లు తెలుస్తోంది.

బద్రీ, జానీ చిత్రాల తర్వాత రేణుదేశాయ్ పెద్దగా నటించిందిలేదు. ఇప్పటివరకు ఓ మూడు నాలుగు సినిమాలు చేసి ఉంటుంది. యాక్టింగ్‌లో సెకండ్ ఇన్సింగ్ ప్రారంభించడానికి మలయాళ చిత్ర పరిశ్రమను ఎంచుకొన్నట్టు తెలుస్తున్నది. కథ నచ్చడంతో వెండితెర మీద రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ చెప్పేసిందట!

ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేణుదేశాయ్ హీరోయిన్ పాత్రలకే మొగ్గు చూపుతుందా? లేదా క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడుతారా అనే విషయం కొద్దిరోజులు ఆగితే తెలుస్తుంది. ఒకవేళ మలయాళ చిత్రం విజయం సాధిస్తే అక్కడ బిజీగా మారిపోయే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -