Saturday, April 27, 2024
- Advertisement -

వైసీపీఅసెంబ్లీ బ‌హిస్క‌ర‌న‌తో …బోటు ఘ‌ట‌న‌పై ఊపిరి పీల్చుకున్న‌ బాబు…

- Advertisement -

వైసీపీ అసెంబ్లీని బ‌హిస్క‌రించ‌డంతో బాబు అండ్ కో అద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఒక వేల స‌మావేశాల్లో ఉంటె అంద‌రికి చుక్క‌లు చూపించేవాల్లు వైసీపీ ఎమ్మెల్యేలు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ లేని లోటు అసెంబ్లీ సమావేశాల్లో క‌నిపిస్తున్నా అధికార పార్టీ మాత్రం సంతోషంగా ఉంది. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

దానికి ప్ర‌ధాన కార‌నం బోటు సంఘ‌ట‌నే. ఆదివారం సాయంత్రం ఇబ్రహింపట్నం ఫెర్రీ వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 20 మంది మరణించారు. గల్లంతైన వారికోసం ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇటువంటి సమయంలో గనుక వైసీపీ అసెంబ్లీలో ఉండివుంటే చంద్రబాబుకు, టిడిపికి నిజంగానే జగన్ సైన్యం చుక్కలు చూపించేదనటంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అందుకె ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీలో బాబు ప్ర‌క‌ట‌న చేశారు.

ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత మామూలుగా అయితే, ప్రతిపక్షం తనదైన స్టయిల్లో ప్రభుత్వంపై విరుచుకుపడాలి. నిజానికి, ప్రభుత్వ ప్రకటన కంటే ముందు ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటుంది. కానీ, ప్రతిపక్షం అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేయడంతో, అధికార పార్టీకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా పోయింది. సింపుల్‌గా బాధ్యుల‌పై ఖ‌టిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ముగించారు.

అస‌లు విస‌యానిక వ‌స్తె ప్రమాదానికి కారణమైన బోటుకు తిరగటానికి అనుమతి లేదు. టిడిపి పెద్దల జోక్యం లేకుండానే ఇంత ప్రముఖ స్ధలంలో అంతపెద్ద బోటు ఎలా తిరుగుతుంది? ఈ ఒక్క బోటే కాదు సుమారు 30 బోట్లు అనుమతి లేకుండానే విచ్చలవిడిగా తిరుగుతున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. అంటే ప్రతీ చోటా అధికారపార్టీ నేతల జోక్యం ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతోంది. ఇటువంటి పరిస్ధితుల్లో గనుక వైసీపీ అసెంబ్లీలో ఉండివుంటే చంద్రబాబును గుక్కతిప్పుకోనిచ్చే వారు కాదు వైసీపీ ఎంఎల్ఏలు.

బోటు ఘ‌ట‌న‌లో 20 మంది ప్రాణాలు పోతే, ఇంత సింపుల్‌గా ప్రకటన చేసేయడమా.? అన్న ప్రశ్నల చర్చ జరగడం సహజమే. గ‌తంలో గోదావరి పుష్కరాల నాటి సంగతి. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదీ చంద్రబాబు ‘పబ్లిసిటీ యావ’ కారణంగా. ఆ ఘటనకు సంబంధించి విచారణ జరిగింది. బాధ్యులెవరో తేలలేదు. అప్పుడూ పోయినవి సామాన్యుల ప్రాణాలే త‌ప్ప త‌ప్పు చేసిన వారిపై ఇప్ప‌టి వ‌ర‌కు చ‌ర్య‌లు లేవు. ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించ‌డం త‌ప్ప …ఇప్పుడ‌న్న చూద్దాం త‌ప్పు చేసిన అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటారో లేదో..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -