Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ సర్దార్ కథ ఇదే?

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వచ్చే నెల 8న రిలీజ్‍కు రెడీ అవుతుంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు, ట్రైలర్ తో సినిమా పై భారీ అంచనాలే పెరిగాయి.

అయితే తాజా సమాచారం ప్రకారం సర్దార్ గబ్బర్ సింగ్ కథ ఇదే నంటూ సోషల్ మీడియాలో ఓ కథ తెగ హాల్ చల్ చేస్తోంది. రతన్ పూర్ సంస్థానంలో భైరవ్ సింగ్ అనే వాడు ప్రజలను చండశాసనుడుగా హింసిస్తూ ఉంటాడు. ఇదే క్రమం లో ఆ భైరవ్ సింగ్ కు రతన్ పూర్ కు చెందినా ఓ యువరాణి పై దృష్టి పడుతుంది.

దీంతో ఆ యువరాణి తండ్రి భైరవ్ సింగ్ నుండి తన కూతురిని కాపాడుకునేందుకు భైరవ్ సింగ్ ను మించిన బలవంతుడిని తెచ్చి అతనికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకుంటాడు.ఆ క్రమం లో రతన్ పూర్ కు సర్దార్ గబ్బర్ సింగ్ ను పోలిస్ ఆఫీసర్ గా దించుతారు. తర్వాత సర్దార్ ఆ యువరాణి ని భైరవ్ సింగ్ ఆటలు కట్టించి ఎలా కాపాడి ఆ యువరాణి ని ఎలా పెళ్ళి చేసుకున్నాడనేది కథాంశం. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా మరి ఎలాంటి విజయం సొంతం చేసుకుంటుందో చూడాలి మరి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -