Thursday, May 16, 2024
- Advertisement -

పక్కా ప్లాన్ తో వస్తున్న పవన్!

- Advertisement -

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ప్లాప్ కావడం వల్ల పవన్ చాలా బాధపడ్డాడట. సరిగ్గా అభిమానులను అలరించలేకపోయానే అని ఫీల్ అయ్యాడట. ఏ సినిమా ఫలితం గూరించి పట్టించుకోని పవన్ సర్దార్ విషయంలో మాత్రం తప్పు ఎక్కడ చేసాను అని అతని సన్నిహితులతో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావిస్తూనే ఉన్నాడట. భారీ అంచనలతో సినిమాని రిలీజ్ చేయడం ఆ అంచనాలను అందుకోలేకపోవడం వల్లే ఇలా జరిగిందని ఆయన సన్నిహితులు అంటున్నారట.

సర్దార్ చిత్ర యూనిట్ హైప్ భారీగా చేయడం వల్ల బిజినెస్ అద్భుతంగా జరిగింది కాని జనాలు అంచనాలు భారీగా పెట్టుకోవడం వల్ల, సినిమా క్లామెక్స్ కూడా కంగారు కంగారుగా చేయడం వల్ల చిత్రం అభిమానులను అలరించలేకపోయింది. అందుకే అలాంటి తప్పు మళ్ళీ చేయకుడదు అని ఫిక్స్ అయ్యాడట పవన్. ప్రస్తుతం ఎస్ జే సూర్య దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రతో తన అభిమానులను అలరించాలి అని జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. ఎలాంటి హైప్ క్రీయేట్ చేయకుండా చూడాలి అని నిర్మాతలకు చెబుతున్నాడట.

పక్కా ప్లాన్ తో సినిమా షూట్ జరగాలి అని దర్శకనిర్మాతలకు చెబుతున్నాడట. ఎలాంటి సినిమా మనం తీస్తున్నామో ముందే జనాలకు ఓ హింట్ ఇవ్వాడం మంచిది ఎందుకంటే అలా హింట్ ఇవ్వడం వల్ల వారు ముందుగానే ప్రిపేర్ అయి వస్తారు అని పవన్ భావిస్తున్నాడట. సో మొత్తాన్నికి ఓ మంచి హిట్ కొట్టాలి అని పవన్ భావిస్తున్నాట్లు తెలుస్తోంది. సో మరి ఎస్ జే సూర్య తో తీస్తున్న ఈ మూడోవ చిత్రం మరో ఖుషి అవుతుందో లేక పులిలా ప్లాప్ అవుతుందో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -