- Advertisement -
టాలీవుడ్ హీరో అడివి శేష్ ..డెకాయిట్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.
ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ గురించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు అడివి శేష్. ఏప్రిల్ 4న డెకాయిట్ ట్రైలర్ రానుంది తెలిపారు. అలాగే ఏప్రిల్ 10న సినిమా రిలీజ్ అవుతుందని ప్రకటించారు.
రొమాన్స్,యాక్షన్,రివెంజ్ అంశాలతో కూడిన థ్రిల్లర్‌గా సినిమా వస్తుండగా ఈ సినిమాలో ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.
