Friday, May 3, 2024
- Advertisement -

ఎపి నుంచి రైల్వే మంత్రి సురేష్ ప్రభు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు వెళ్లే తెలుగుదేశం సభ్యులను ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. ఎపి నుంచి రాజ్యసభకు నాలుగు స్ధానాలున్నాయి. వీటిలో మూడు స్థానాలను తెలుగుదేశం గెలుచుకునే అవకాశం ఉంది. దీంతో ఈ స్ధానాల కోసం కేంద్ర మంత్రి సుజనా చౌదరి, ఈమధ్య కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరిన టి.జి.వెంకటేష్ లను ఎంపిక చేశారు.

ఒక స్ధానాన్ని మిత్రపక్షమైన బిజెపికి కేటాయించారు. ఈ స్ధానం నుంచి కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు రాజ్యసభకు వెళ్తారని ఎపి ముఖ్యమంత్రి, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. దీంతో టిడిపి, బిజెపిల మధ‌్య కొన్నాళ్లుగా రగులుతున్న మాటల యుద్ధానికి తాత్కాలికంగా తెరపడినట్లే. రాష్ట్రం విడిపోయినప్పుడు రాజ్యసభ్యుడిగా ఉన్న సుజనా చౌదరి ఎంతో పోరాటం చేశారని, ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు కూడా ఆయన ప్రయత్నిస్తున్నారని,  అందుకే మరోసారి రాజ్యసభ టిక్కట్ ఇచ్చామని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఇక కర్నూలు నుంచి ఇంత వరకూ ఎవరికి అవకాశం ఇవ్వలేదని, అందుకే ఈసారి టి.జి.వెంకటేష్ ను ఎంపిక చేశామని చెప్పారు. మూడో స్ధానం నుంచి బిజెపి అభ్యర్ధిగా సురేష్ ప్రభు పోటీ చేస్తారని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కోరడంతో ఆ స్ధానాన్ని ఆ పార్టీకే కేటాయించామని ఆయన అన్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -