Saturday, May 4, 2024
- Advertisement -

హమ్మయ్య..పవన్ పోటీ చేసేది అక్కడినుండే?

- Advertisement -

జనసేన కార్యకర్తలకు ఇది నిజంగా గుడ్ న్యూసే.టీడీపీ – జనసేన పొత్తు తర్వాత పవన్ పోటీ చేసే స్ధానంపై రోజుకో వార్త ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో భీమవరంతో పాటు గాజువాక నుండి పవన్ పోటీ చేయగా ఈ సారి భీమవరం నుండే పోటీ చేయడం దాదాపు ఖాయమైంది.

భీమవరం నుండి పవన్ పోటీకి చంద్రబాబు సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. ఇక భీమవరి నుండి పవన్ పోటీచేస్తే అది పక్కన నియోజకవర్గాలపై కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉంటుంది అందుకే భీమవరమే ఖాయమైందని సమాచారం. దీనిపై త్వరలోనే అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

ఇక 2019 ఎన్నికల్లో వైసీపీకి 70,642 ఓట్లు రాగా పవన్‌కి 62,285 ఓట్లు రాగా టీడీపీకి 54 వేల ఓట్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈసారి టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తుండటంతో పవన్ గెలుపు నల్లేరుపై నడకే కానుందని అంచనా వేస్తున్నారు.

పవన్ సొంత జిల్లా పశ్చిమ గోదావరి కాగా భీమవరం నుండి గెలిస్తే సొంత జిల్లా నుండి గెలిచామనే ధీమా వ్యక్తం చేస్తున్నారట. ఇక ఒకసారి గెలిచాక భీమవరాన్ని కంచుకోటగా మార్చుకునేందుకు ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారట పవన్. అయితే పవన్ ఇంకోచోటు నుండి కూడా పోటీ చేస్తే బాగుంటుందని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా తిరుపతి, అనంతపురం అర్బన్, పిఠాపురం పేర్లు వినిపిస్తున్న దీనిపై క్లారిటీ లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -