Saturday, April 27, 2024
- Advertisement -

వైసీపీ తరపున ప్రభాస్ ఫ్యాన్స్‌!

- Advertisement -

ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ఏ క్షణమైన విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల రణక్షేత్రంలో అధికార వైసీపీ మేము సిద్ధం అని దూసుకుపోతుండగా ప్రతిపక్ష టీడీపీ – జనసేన – బీజేపీ కూటమి మాత్రం కాస్త వెనుకబడే ఉంది. ఇక ఎన్నికల్లో సీఎం జగన్ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు.

అభ్యర్థుల ఎంపికలో అన్ని తానై, అన్ని అంశాలను పరిశీలించాకే ప్రకటన చేస్తున్నారు. ఇక తాజాగా వైసీపీ నుండి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రభాస్ ఆమె తరపున ప్రచారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

శ్యామలా దేవికి పోటీ చేసే స్థానంపై జగన్ ఓ క్లారిటీకి వచ్చారని త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన ఉండే అవకాశం ఉంది. కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి ఎప్పటినుండో రాజకీయాల్లో ఉన్నారు. త్వరలోనే వైసీపీ తరపున శ్యామలాదేవి పోటీ చేస్తారని ప్రచారం జరగుతుండటం, వైసీపీ తరపున ప్రభాస్ ఎన్నికల క్యాంపెయిన్‌లో పాల్గొంటారని టాక్ నడుస్తుండగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -