దర్శకధీరుడు రాజమౌళి తన సినిమాల కోసం ఏ రెంజ్ లో కష్టపడుతారో ప్రత్యేకించి చెప్పకర్లేదు. అయితే రాజమౌళి తన సినిమాల ప్రెస్‌మీట్లు, ప్రమోషన్ కార్యక్రమాలు తప్పిస్తే ఇతర కార్యక్రమాలలో పెద్దగా కనిపించరు. ఇక రాజమౌళి ఇప్పుడు ఇండియాలోని టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉన్నా హంగు ఆర్భాటాలకు చాలా దూరంగా ఉంటారు.
విలాసవంతమైన జీవితానికి రాజమౌళి చాలా దూరంగా ఉండడం వల్లే తనపై ఒక్క రూమర్ కూడా లేకుండా చూసుకోగలిగాడు. అలాగని రాజమౌళి పండగలు, ఇతర శుభ సందర్భాలను తన కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా సెలబ్రిట్ చేసుకుంటాడు. పబ్‌లు, పార్టీలకు రాజమౌళి వచ్చినట్టు మనం ఏనాడు వార్తల్లో చూడలేదు. అందుకే రాజమౌళికి టాలీవుడ్‌లో తిరుగులేని గుడ్‌విల్ ఉంది.
అలాంటి రాజమౌళిలో సడెన్‌గా చిన్న పాటి మార్పు వచ్చింది. రాజమౌళి అందరినీ పిలిచి మరీ ప్రభాస్‌కు పార్టీ ఇవ్వనున్నాడట. రాజమౌళి ఇలా ఎందుకు చేస్తున్నాడా ? అన్న అంశం ఇప్పుడు టాలీవుడ్‌లో పెద్ద సంచలనంగా మారింది. బాహుబలి కోసం దాదాపు నాలుగేళ్లు జక్కన్నకు అర్పించి, ప్రభాస్ పడ్డ కష్టానికి రాజమౌళి ఇలా కృతజ్ఞత తెలుపుతున్నాడని చెప్పుకుంటున్నారు. ఇలా ప్రభాస్ తన కష్టంతోనే రాజమౌళిని మెప్పించాడని..అందుకే రాజమౌళి ఇలా ప్రభాస్‌కు పార్టీ ఇస్తున్నాడని ఇండస్ట్రీ ఇన్నర్ టాక్?
{youtube}g8PFTtexdQw{/youtube}
Related