Thursday, May 9, 2024
- Advertisement -

ప్రభాస్ ఎలాంటి ఆఫర్ వదులుకున్నాడో తెలుసా?

- Advertisement -

బాహుబలి సినిమాతో ప్రభాస్ కి ఏ రెంజ్ లో ఫాలోయింగ్ వచ్చిందో ప్రత్యేకంకగా చెప్ప‌క్క‌ర్లెద్దు. ప్రస్తుతం ప్రభాస్ సరే అంటే కోట్లు కుమ్మ‌రించి సినిమాలు తీయడానికి బడా నిర్మాతలు రెడీ గా ఉన్నారు. పారితోషికం కూడా ఊహించ‌నంత ఇవ్వ‌డానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ బాహుబలి-2 సినిమాతో బిజీగా ఉన్నాడు.

ఈ చిత్రం తర్వాత ఓ ప్రేమకథ చిత్రంలో నటించనున్నాడు. అయితే ప్రభాస్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడానికి కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. అయితే ప్రభాస్ మాత్రం ఆచితూచి అడుగేస్తున్నాడు. ఆ మధ్య మహేంద్ర వెహికిల్ కి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేశాడు. దానికి సంబధించిన షూట్ లో కూడా పాల్గొన్నాడు. ఇప్పుడు ప్రభాస్ కోసం మరో అద్భుతమైన ఆఫర్ వచ్చింది.

ఓ ఫిట్నెస్ బ్రాండ్.. ప్రభాస్ ని బ్రాండ్ అంబాసిడర్ గా అప్రోచ్ అయ్యింది. దీనికి కోసం రూ 5.5 కోట్ల భారీ అమౌంట్ ను ఆఫర్ చేసింది. అయితే ప్రభాస్ మాత్రం ఆ భారీ ఆఫర్ కు నో చెప్పాడట. వారి కాన్సెప్ట్ నచ్చలేదో, కంపెనీ నచ్చలేదో, కండీషన్స్ నచ్చలేదో గానీ ఈ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించేశాడట ప్రభాస్. రూ 5.5 కోట్ల అంటే భారీ మొత్తం. మరి ఇంత క్రేజీ ఆఫర్ ను ప్రబాస్ ఎందుకు వదులుకున్నట్లు? అన్న చర్చ జరుగుతోంది టాలీవుడ్ సర్కిల్స్ లో.

Related

  1. హమ్మయ్య ప్రభాస్ కి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇచ్చారు
  2. ప్రభాస్ కోసం మిస్ ఇండియా ని దించుతున్నారు
  3. ప్రభాస్ కి ప్రేమకథ చిత్రం కావాలట!
  4. మహేష్, ప్రభాస్ ల మీద కామెంట్స్ చేసిన చెర్రీ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -