బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రభాస్ ఎంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఇలా అమాంతం పెరిగిన ప్రభాస్ ఇమేజ్ ను మరింత క్యాష్ చేసుకోవాడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు.
ఇక ప్రభాస్ కూడా తక్కువేం తినలేదు బాహుబలి తో వచ్చిన ఇంటర్నేషనల్ స్టార్ డం ని అలాగే కంటిన్యూ చేయడానికి పెద్ద ప్లానే వేసాడు. ప్రస్తుతం చేస్తున్న బాహుబలి పార్ట్ 2 తర్వాత యువి క్రియేషన్స్ బ్యానర్ పై సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే
అయితే ఆ చిత్రాన్ని ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ , హిందీ బాషలలో కూడా నిర్మించానున్నారట దీనివల్ల బాలీవుడ్ జనాలకు మాత్రమే కాకుండా మాలీవుడ్ ,కోలీవుడ్ , హాలీవుడ్ స్థాయిలో కూడా వసూళ్లు రాబట్టవచ్చు అని ప్లాన్ చేస్తున్నారు . భారీ స్థాయిలో ఖర్చు పెట్టినా రాబడి కి డోకా ఉండదని భావిస్తున్నారట . అదే సమయంలో బాహుబలి పార్ట్ 2 తర్వాత వచ్చే చిత్రం కాబట్టి అంచనాలు కూడా భారీగా ఉంటాయి కాబట్టి ఓపెనింగ్స్ కూడా భారీగానే ఉండొచ్చని ఒకవేళ ఆ సినిమా నచ్చితే మరింత మార్కెట్ పెరిగే చాన్స్ ఉంటుందని భావిస్తున్నారట .
