Monday, May 6, 2024
- Advertisement -

రాజస్దాన్ నుంచి వెంకయ్య.. కర్నాటక నుంచి సీతారామన్

- Advertisement -

భారతీయ జనతాపార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య ఉన్న స్నేహానికి కాలం చెల్లినట్టేనా.. ? పరిస్ధితులు చూస్తే అలాగే అనిపిస్తోంది. దీనికి రాజ్యసభ ఎన్నికలే వేదికగా మారుతున్నాయి. దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు సభ్యులు ఎంపిక కావాల్సి ఉంది.

గతంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆమె పదవీ కాలం ముగిసింది.  ఈసారి కూడా ఆమె ఆంధ్రప్రదేశ్ నుంచే రాజ్యసభకు ఎంపికవుతారని అందరూ భావించారు. అందుకు తగ్గట్టుగానే ఎపిలో ఖాళీగా ఉన్న నాలుగు రాజ్యసభ స్ధానాల్లో ఒకటి సీతారామన్ కు ఇస్తారనే ప్రచారం కూడా జరిగింది. అయితే బిజెపి మాత్రం అనూహ్యంగా నిర్మలా సీతారామన్ ని కర్నాటక నుంచి రాజ్యసభకు పంపాలని నిర్ణయించింది. అంతే కాదు.. ఇంతకు ముందు కర్నాటక నుంచి రాజ్యసభకు వెళ్లిన పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడును ఈసారి రాజస్ధాన్ నుంచి రాజ్యసభకు పంపాలని తీర్మానించారు.

ఈ నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో ఇక తెగదెంపులు చేసుకోవాలని బిజెపి భావిస్తున్నట్టుగా ఉంది. నిజానికి ఈ మైత్రిని ఇలాగే కొనసాగించాలని పార్టీ అధిష్టానం ఆశిస్తోంది. కాని ఎపి క్యాడర్ మాత్రం పార్టీ ఎదగాలంటే టిడిపితో మైత్రి ఉండకూడదని, ఆ పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని భావిస్తోంది. పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు అధిష్టానం కూడా నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కూడా బిజెపిపై తరచుగా విరుచుకుపడుతోంది. దీంతో ఇరు పార్టీల మధ్య బంధం తెగిపోయేలా కనిపిస్తోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -